టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత, పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు మొదటి రౌండ్ లోనే దుమ్ము రేపారు. ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైన తొలి రౌండ్ లో హరీష్ రావు 6వేల మెజార్టీతో లీడ్ లో ఉన్నారు. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి హరీష్ రావు 6368 ఓట్ల ఆధిక్యం చూపించారు.
ఇక రెండో రౌండ్ పూర్తయ్యే సరికి హరీష్ రావు ఆధిక్యత పెరిగింది. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 13040 ఆధిక్యం చేరుకున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి 19925 ఓట్ల ఆధిక్యంలో హరీష్ రావు కొనసాగుతున్నారు. రౌండ్ రౌండ్ కూడా ఆరు వేల చొప్పున హరీష్ రావు ఆధిక్యం కనబడుతున్నది.
లక్ష మెజార్టీ టార్గెట్ గా హరీష్ రావు ఈ ఎన్నికల్లో సిద్ధిపేట బరిలో ఉన్నారు. సిద్ధిపేటలో హరీష్ రావుకు ప్రతి ఎన్నికలోనూ తిరుగే లేని పరిస్థితి ఉంది. ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మధ్య హరీష్ ఆధిక్యం పెరుగుడే తప్ప తగ్గే పరిస్థితి లేదు.
సిద్ధిపేటలో కేసిఆర్ ఒకసారి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కేసిఆర్ వెనుతిరిగి చూడలేదు. వరుసగా గెలిచారు. తర్వాత సిద్ధిపేటకు హరీష్ వచ్చారు. అప్పట ినుంచి ఓటమెరుగని నాయకుడిగా హరీష్ నిలిచారు. 90 వేలపై చిలుకు మెజార్టీ సాధించిన హరీష్ తన రికార్డులు తానే తిరగరాస్తున్నారు. ఈ ఎన్నికల్లో లక్ష టార్గెట్ గా ఉన్న హరీష్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇక తొలి రౌండ్ ఫలితాలు వెలువడే సమయానికి సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కేవలం 214 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. వర్దన్నపేటలో టిఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ లీడ్ లో ఉన్నారు. ఇబ్రహింపట్నంలో బిఎస్పీ అభ్యర్థి (కాంగ్రెస్ రెబెల్) మల్ రెడ్డి రంగారెడ్డి లీడ్ లో ఉన్నారు.
తొలి రౌండ్ లో ఎంఐఎం పార్టీ రెండు స్థానాల్లో లీడ్ లో కనబడింది. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి లీడ్ లో ఉన్నారు. అలాగే మిర్యాలగూడలో బిసి ఉద్యమ నేత కాంగ్రెస్ అభ్యర్థి ఆర్. కృష్ణయ్య తొలి రౌండ్ లో ఆధిక్యతలో ఉన్నారు.
ములుగు లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మంత్రి చందూలాలల్ పోటీలో ఉన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి, నిర్మల్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నది.
తుంగతూర్తిలో పోస్టల్ బ్యాలెట్లలో టిఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్ ఆధిక్యత చూపారు. కానీ తర్వాత తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థఇ అద్దంకి దయాకర్ లీడ్ చూపించారు.
కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తొలి రౌండ్ లో ఆధిక్యంలో ఉన్నారు.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ లీడ్ లో ఉన్నారు.
పాలేరులో మంత్రి తుమ్మల లీడ్ లో ఉన్నారు.
గజ్వేల్ లో సిఎం కేసిఆర్ తొలి రౌండ్ లో 5వేల పైచిలుకు ఓట్లతో లీడ్ లో ఉన్నారు.
షాకింగ్ : వెనుకంజలో డికె అరుణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలుగా పేరున్న జానారెడ్డి నాగార్జున సాగర్ లో వెనుకబడ్డారు. నోముల నర్సింహ్మయ్య లీడ్ లో ఉన్నారు. అలాగే గద్వాలలో డికె అరుణ తొలి రౌండ్ లో వెనుకబడ్డారు. టిఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి 1496 ఓట్ల లీడ్ లో ఉన్నారు. జనగామలో పొన్నాల లక్ష్మయ్య వెనుకబడ్డారు.
మరో మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డ ికూడా వెనుకంజలో ఉన్నారు.
తొలి రౌండ్ లో కొడంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. 200 పైచిలు కు ఓట్ల తో తొలి రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు.
మరోవైపు జహీరాబాద్ లో మాజీ మంత్రి, సీనియర్ నేత జె గీతారెడ్డి వెనుకంజలో ఉన్నారు.
టిడిపి దివంగత నేత హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేసిన కూకట్ పల్లిలో టిఆర్ఎస్ లీడ్ లో ఉంది. ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 1421 లీడ్ లో ఉన్నారు.