టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఈ మధ్య కాలంలో శత్రుత్వం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. విమర్శల విషయంలో ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ తగ్గడం లేదు. రాజకీయాల విషయంలో సంచలనాలు సృష్టించాలని ఈ రెండు పార్టీలు భావిస్తూ తమదైన శైలిలో వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ వ్యూహాలు ఈ రెండు పార్టీలను ప్రజల మధ్య చులకన చేస్తుండటం గమనార్హం.
ఐటీ, ఈడీ దాడులతో బీజేపీ టీఆర్ఎస్ కు చుక్కలు చూపించింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సర్కార్ సిట్ ద్వారా అమిత్ షాకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ దొందూ దొందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ రెండు పార్టీలలో పైచేయి సాధించే పార్టీ ఏదో చూడాల్సి ఉంది.
చిన్నచిన్న తప్పులు చేస్తుండటం వల్ల ఈ రెండు పార్టీలు ఇతర పార్టీలకు విమర్శలు చేసే ఛాన్స్ ఇస్తున్నాయి. మునుగోడులో తెరాస విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రస్తుతం జోష్ లో ఉంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెరాస భావిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఅర్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
పార్టీకి అనుకూలంగా లేని నియోజకవర్గాల్లో కొత్త స్కీమ్ లను అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ త్వరలో అలాంటి నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను నియమించనున్నారు. కేసీఆర్ సర్కార్ కు 2024 ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తాయో సర్ప్రైజ్ ఇస్తాయో చూడాల్సి ఉంది.
