శరీర బరువును తగ్గించుకోవాలంటే ఈ కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి?

ఈ ప్రకృతిలో లభించే అన్ని కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున మన రోజు వారి ఆహారంలో ఏదో ఒక కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మన ఆరోగ్య పరిస్థితుల దృశ్య అతి బరువు సమస్యతో బాధపడేవారు అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న కూరగాయలను ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో అధిక క్యాలరీలు లభ్యమయి సమస్య మరింత తీవ్రమౌతుంది. కాబట్టి శరీర బరువును నియంత్రించుకోవాలంటే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న కూరగాయలను మాత్రమే తమ రోజువారి డైట్ లో చేర్చుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.

మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ అత్యంత ప్రధానమైనది అయినప్పటికీ అతి బరువు సమస్యతో బాధపడే వారు మాత్రం కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడమే ఆరోగ్యం మంచిది. శరీర బరువును తగ్గించుకోవాలనుకున్నవారు టమోటాలను తప్పనిసరిగా రోజువారి ఆహారంలో చేర్చుకోవాల్సిందే. కారణం టమోటాలో అత్యల్పంగా కార్బోహైడ్రేట్స్ అత్యధికంగా విటమిన్ సి లభ్యమవుతుంది. శరీర బరువును తగ్గించుకోవడంతో పాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి నీటి శాతం ఎక్కువగా ఉండే దోసకాయను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర బరువును తొందరగా నియంత్రించుకోవచ్చు.

బరువు తగ్గాలనుకున్నవారు రోజువారి ఆహారంలో అత్యల్ప కార్బోహైడ్రేట్స్ ఉన్న పాలకూరను ఆహారంలో తింటూనే ప్రతిరోజు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పాలకూరలో సమృద్ధిగా ఉన్న ఐరన్ మనలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అధికం చేసి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. కాలీఫ్లవర్ లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు సమృద్ధిగా లభ్యమవుతాయి కావున వీటిని రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే శరీర బరువును తగ్గించుకోవడంతో పాటు శరీరంలో క్యాన్సర్ కారక కణాలను నియంత్రిస్తుంది. అత్యల్ప కార్బోహైడ్రేట్స్ లభ్యమయ్యే పుట్టగొడుగులను కూడా శరీర బరువును తగ్గించుకోవాలనుకున్నవారు నిక్షేపంగా రోజువారి ఆహారంలో తీసుకోవచ్చు.