Revanth Reddy: ఆ కారణంతోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాము… సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలలో మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విషయంలో కూడా మార్పులు చేయడంతో ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఖండించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు అయితే ఈయన గత ఎన్నికలలో ఓడిపోవడంతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు..

ఇక ఈయన అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విగ్రహం పట్ల ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చాము ఈ విగ్రహ ప్రత్యేకతలు ఏంటి అనే విషయాల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు.

నిన్నటి నుంచి తెలంగాణ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..జాతి అస్తిత్వమమే గుర్తు అని, ఆ అస్తిత్వానికి మూలం మన సంస్కృతి అని రేవంత్ చెప్పారు. అందుకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనులను ఐక్యం చేసింది ఆ ప్రతి రూపమేనని అన్నారు. తెలంగాణ తల్లి అంటే ఒక భావోద్వేగమని తెలియజేశారు.

మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్ట కమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో కూడిన చీరతో చాకలి ఐలమ్మ (సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపం ఉందని రేవంత్ అన్నారు. కుడి చేతితో జాతికి అభయమిస్తూ.. ఎడమ చేతిలో తెలంగాణలో పండే పంటలతో తల్లి దర్శనమిస్తుందని ఈయన తెలియజేశారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆత్మ బలిదానాలకు సంకేతంగా పీఠంలో పిడికిలిని పొందుపరిచామని, తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం చరిత్రకు దర్పణమని అన్నారు.