బ్రతికుండగానే భర్తను స్మశానానికి తీసుకెళ్ళిన భార్య… కాల యముడుగా మారిన ఇంటి ఓనర్?

ఈ సమాజం సిగ్గుతో తలదించుకొనే సంఘటన ఇది అనారోగ్య సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భర్తను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక స్మశానంలోకి తీసుకువెళ్లగా అక్కడే 24 గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఈ సంఘటన వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

కరీంనగర్ పట్టణంలో నివాసముంటున్న బసవరాజు కనకయ్య అనే వ్యక్తి రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో వైద్య పరీక్షలు చేయించే అంత స్తోమత లేక తన భార్య తనని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఎక్కడికి వెళ్ళినా తనకు వైద్యం చేసిన ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన భర్తను ఇంటికి తీసుకువస్తుండగా ఆ ఇంటి ఓనర్ వారి పట్ల కాల యముడిగా మారారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన భర్తను ఇంట్లోకి తీసుకురావడానికి వీలు లేదంటూ ఆయన చెప్పడంతో ఏం చేయాలో దిక్కు తెలియక ఆ తల్లి కూతుర్లు బ్రతికుండగానే తన భర్తను స్మశానానికి తీసుకెళ్లిన ఘటన అందరి హృదయాలను పిండి వేస్తోంది.

ఇలా స్మశానంలో కాలుతున్న శవాల పక్కన ప్రత్యక్షంగా చావును చూస్తూ 24 గంటల పాటు నరకం అనుభవించిన కనకయ్య తుది శ్వాస విడిచారు. ఇలా బ్రతికుండగానే తన భర్తను స్మశానంలోకి తీసుకు వెళ్లడంతో ఆ తల్లి కూతుర్ల రోదన అందరిని కంటతడి పెట్టిస్తోంది.భర్త చనిపోయిన అనంతరం ముట్టు కారణంగా 10 రోజులపాటు ఇంట్లోకి యజమాని రానివ్వకపోవడంతో ఆ తల్లి కూతుర్లు స్మశానంలో నివసించడం గమనార్హం. ఇలా ఈ విషయం ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో పలు చర్చలకు కారణమైంది.