టిడిపి అనంతపురం లోక్ సభ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఏ విషయాన్నయిన నిస్సంకోచంగా చెబుతారు. అందుకే ఆయనేమన్నా జనం అసక్తి వింటారు. ఆయనే మ్మాట్లాడినా పెద్ద చర్చ జరుగుతుంది. సంచలనం సృష్టిస్తుంది. ఇపుడాయన టిడిపి కాంగ్రెస్ పొత్తు గురించి కూడా ఆసక్తి కరమయిన సంచలనాత్మక వ్యాఖ్యలే చేశారు. ఒక్క మాటలో చెబితే, టిడిపి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పేమీ లేదన్నారు. అంతేకాదు, కెసియార్ ముందస్తు ఎన్నికల ఉరుకుల పరుగుల మీద కూడా ఆసక్తి కరమయిన వ్యాఖ్య చేశారు. ఇంతవరకు ఈయాంగిల్ ను ఎవరూ చూల్లేదు. ఆయన ఎన్డీయేలో చేరబోతున్నారని అన్నారు. చంద్రబాబు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చునేందుకు రంగం సిద్ధమయిందని జెసి సమాచారం.
మంగళవారం నాడు ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి ని కలిశారు. అనంతరం మీడియాతో టిడిపి కాంగ్రెస్ పొత్తు మీద తన మనసులో మాట వెల్లడించారు. రాష్ట్ర విభజన నెపాన్ని కాంగ్రెస్ మీదే కాకుండా టిడిపి మీద కూడ వేశారాయన. బిజెపిని నమ్మితెలుగు ప్రజలు మోసపోయారని చెబుతూ అధికారంలోకి వస్తే ఆంధ్రాకి న్యాయం చేస్తానని కాంగ్రెస్ అంటున్నపుడు కాంగ్రెస్‌ను నమ్మితె తప్పేమీ ఉందని ఆయన అన్నారు.తెలంగాణ లో కాంగ్రెస్ టిడిపి పొత్తు మంచిదేనని, దానిని ఆంధ్రా ప్రజలకు కూడా హర్షిస్తారని కూడా జెసి అన్నారు.
‘తెలంగాణలో తెలుగుదేశం బలహీనంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ మద్దతు కోరుతూ ఉంది… రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదు..’ అని దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ లేదు. ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారు.
విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటికి ఉంది.
పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు
ముందస్తు ఎన్నికలకు పోవడం కేసీఆర్ రాజకీయ కుయుక్తి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు ఉంటుంది. ఇపుడు పొత్తు పెట్టుకుంటే ముస్లింలు దూరం అవుతారనే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుకు వెళుతున్నాడు కెసిఆర్.