రైతుల లోన్ డబ్బులతో జల్సాలు చేసిన బ్యాంక్ మేనేజర్… రైతు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా బ్యాంకులలో పని చేసే వారికి వేళల్లో జీతం, వారాంతపు సెలవులు ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉంటారు. అయితే మరికొంతమంది రైతులను అమాయకులను చేసి వారి చేత డబ్బులు కట్టేస్తూ భారీగా నొక్కేస్తూ ఉంటారు. అయితే ఇది తెలియని రైతులు నిత్యం మోసపోతూనే ఉంటారు. తాజాగా నాగర్ కర్నూలుకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్ సైతం రైతులకు మాయ మాటలు చెప్పి భారీగా లోన్ డబ్బులు నొక్కేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు( ఐఓబీ)లో భాస్కర్​రెడ్డి అను ఉద్యోగి బ్రాంచ్ మేనేజర్​ గా వ్యవహరిస్తున్నారు. ఈయనకు రైతులంటే మహా ఇష్టం ఉన్నట్లు నటించి వారి వస్తే వారిని కూర్చోబెట్టి మాట్లాడేవారు.ఈ క్రమంలోనే క్రాప్ లోన్లకు వన్ టైం సెటిల్మెంట్ లేకపోయినా ఉందని ప్రకటించడంతో రైతులు ఒకేసారి లోన్ చెల్లించడం వల్ల తమకు కొంత భారం తగ్గుతుందన్న ఉద్దేశంతో కొందరు రైతులు లక్షల్లో డబ్బులను బ్యాంకుకు కట్టారు.

ఇలా లక్షల్లో రైతులలోను కట్టడానికి రాగా వాటిలో కొంత మొత్తం నొక్కేసి మరికొంత భాగాన్ని రైతుల ఖాతాలో జమ చేసేవారు. ఇక రైతులు రిసిప్ట్ ఇవ్వమని అడిగితే రేపు ఎల్లుండి అంటూ మాట మారుస్తూ ఉండేవారు. ఇది గుర్తించిన ఓ రైతు ఏకంగా బ్యాంకు మేనేజర్ పై హెడ్ ఆఫీస్ కు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది.సోమవారం చీఫ్​ జనరల్​ మేనేజర్ ఎంక్వైరీకి రాగా బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ రెడ్డి కళ్లు తిరుగుతున్నాయని బ్యాంక్​లోనే స్పృహ తప్పి పడిపోయినట్టు నటించారు.ఈ క్రమంలోనే ఒళ్ళు మండిన ఓ రైతు ఏకంగా బ్యాంకు మేనేజర్ కారుని తీసుకెళ్లి తన ఇంటి ముందు పెట్టేసుకున్నారు. ఈ క్రమంలోనే పై అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని తెలియజేశారు.