మనలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని భావిస్తుంటారు. అలా సంపాదించాలని భావించే వాళ్లకు స్టాక్ మార్కెట్ పై అవగాహన ఉంటే సులువుగానే ఎక్కువ మొత్తం సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి. స్టాక్ మార్కెట్లో పలు బ్యాంకులు దుమ్ము రేపాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు అదిరిపోయే లాభాలను అందిస్తున్నాయి. యూకో బ్యాంకులో ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు సులువుగా రూ.2 లక్షలు పొందే ఛాన్స్ ఉండేది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఇన్వెస్టర్లకు ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తుండటం గమనార్హం. ఆరు నెలల క్రితం లక్ష రూపాయలు ఈ బ్యాంక్ షేర్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఇప్పుడు సులువుగా 50,000 రూపాయల లాభం అయితే వచ్చేది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అదిరిపోయే లాభాలను అందిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
అయితే స్టాక్ మార్కెట్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఏ మాత్రం అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇన్వెస్ట్ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నష్టాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొన్నిసార్లు భారీ స్థాయిలో నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం డబ్బు సంపాదించాలని భావించే వాళ్లు ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పవచ్చు.