TG: తెలంగాణ అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మాన సభలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక ఈ సంతాప సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. దేశానికి మన్మోహన్ సింగ్ దిశా నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు.
ఇలా మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం. కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న కూడా అందజేశారు. ఇక కెసిఆర్ గారి హయామంలోనే హైదరాబాదులో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన మాట్లాడలేదని తెలిపారు.
కెసిఆర్ దాదాపు రెండు సంవత్సరాలపాటు కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు. ఇలా మన్మోహన్ సింగ్ సంతాప సభలో భాగంగా హరీష్ రావు కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని వివరించారు దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్నది మన్మోహన్ సంతాప సభలు ఇలాంటి సమయంలో ఏదైనా మాట్లాడాల్సి వస్తే మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడాలి కానీ కేసీఆర్ గురించి ప్రస్తావన తీసుకురావద్దు అంటూ రెండు చేతులు జోడించి తెలియజేశారు.. ఇలా పొన్నం ప్రభాకర్ చెప్పడంతో మాజీ మంత్రి హరీష్ రావు తిరిగి మన్మోహన్ సింగ్ గొప్పతనం గురించి ఆయన దేశానికి అందించిన సేవలు గురించి కొనియాడారు.