Revanth Reddy: తెలంగాణ రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో తోడ్పాటునందిస్తుందని చెప్పారు. సంక్రాంతి పండుగకు ముందే “రైతు భరోసా” (Rythu Bharosa Scheme) పథకాన్ని అమలు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని హామీ ఇచ్చారు.
BRS Leader KTR: కేటీఆర్ బ్రేక్ వెనుక అసలు వ్యూహమేంటి?
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు తగిన ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని రేవంత్ (Revanth Reddy) చెప్పారు. ప్రస్తుతం సన్న బియ్యానికి అదనంగా 500 రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా చేపట్టే రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకూ అవసరమైన మద్దతు అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకం అమలుపై చర్చించి తగిన విధి విధానాలు రూపొందిస్తామన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రైతాంగాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకపోగా, తాము రైతుల భవిష్యత్‌కు పునాది వేస్తున్నామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) వరి సాగుపై చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో ఉండగానే, తాము రైతు సంక్షేమానికి బడ్జెట్ కేటాయించి పని చేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు సన్న బియ్యం వంటా కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటామని రేవంత్ (Revanth Reddy) తెలిపారు. రైతు సంక్షేమం, విద్య రంగ అభివృద్ధి తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగగా కాకుండా పండగగా తీర్చిదిద్దుతుందని ధైర్యం కలిగించారు. రైతులందరికీ అభివృద్ధి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. తాము చెప్పిన మాటను నిలబెట్టుకుని, రైతులకు భరోసా ఇచ్చే దిశగా మరింత చర్యలు తీసుకుంటామని చెప్పారు.