తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఘన విజయం సాధించింది. కారు జోరుకు కూటమి సహా ఇతర పార్టీలు అన్నీ కుదేలయ్యాయి . 119 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ 83 స్థానాలో విజయం సాధించి రెండో సారి అధికారాన్ని కైవసం చేసుకుంది.
తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన తెరాస అధినేత కేసీఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణతోపాటు అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అదే సమయంలో ఈ ఎన్నికల్లో సినీ ఇండీస్ట్రీ నుండి పలువురు ప్రముఖలు పోటీ చేసి ఓటిమి పాలయ్యారు. ప్రముఖ నిర్మాత భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ టీడీపీ పార్టీ తరుపున శేరిలింగంపల్లి నియోజిక వర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.
అలాగే బాబు మోహన్ అందోల్ నుండి , నటి రేష్మ రాథోడ్ వైరా నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరితో పాటు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల సోదరి నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుండి పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు.