బుల్లెట్ పై నుంచి కింద పడ్డ తెలంగాణ స్పీకర్ (వీడియో)

తెలంగాణ స్పీకర్ మధు సూదనాచారి తన సొంత నియోజకవర్గం భూపాలపల్లిలో రాత్రింబవళ్లు పర్యటిస్తున్నారు. స్పీకర్ గా అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో ఆయన నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. గ్రామాల్లో ఎసి కార్లు పక్కన పడేసి స్పీకర్ బుల్లెట్ మీదే ప్రయాణిస్తున్నారు. 

జనాల యోగ క్షేమాలు తెలుసుకుంటూ గ్రామాలన్నీ చక్కర్లు కొడుతున్నారు. తాజాగా భూపాలపల్లి నియోజకవర్గంలో బుల్లెట్ మీద స్పీకర్ పర్యటిస్తున్న సందర్భంలో ఎడ్ల బండి ఆయన బెల్లెట్ కు అడ్డమొచ్చింది. దీంతో ఆ ఎడ్ల బండిని తప్పించబోయిన స్పీకర్ బుల్లెట్ మీద నుంచి కింద పడిపోయారు. అయితే అప్పటికే స్పీడ్ తక్కువగా ఉండడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. 

అనంతరం అదే బుల్లెట్ మీద తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు స్పీకర్ మధుసూదనాచారి. వీడియో కింద ఉంది.