సినిమాల్లో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలు, రాజకీయాల్లో గుర్తింపును సొంతం చేసుకున్న నేతలు రెండు పడవల ప్రయాణం చేయడం కరెక్ట్ కాదు. అయితే కేసీఆర్ మాత్రం అటు రాష్ట్రంలో ఇటు దేశంలో రాజకీయాలలో సంచలనాలు సృష్టించాలని భావిస్తున్నారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తేలిక కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రాష్ట్రంలోని అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై కొంతమేర వ్యతిరేకత అయితే ఉంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పుంజుకుంటున్నాయి. రెండు పార్టీలకు అనుకూలంగా ఫలితాలు వస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ పాలన బాగానే ఉందని అయితే మరీ అద్భుతంగా మాత్రం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కొత్త పథకాల అమలు దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అధికారం రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. కొత్త పథకాలను తెలంగాణ సర్కార్ అమలు చేయాల్సిన అవసరం ఉందని కొంతమంది చెబుతున్నారు.
కేసీఆర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది. కేసీఆర్ 2024 ఎన్నికల్లో కేటీఆర్ ను సీఎం చేయబోతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాల్సి ఉంది.