ప్రగతి నివేదన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రగతి భవన్ లో అరగంట పాటు మాత్రమే కేబినెట్ సమావేశం జరిగింది.
సమావేశం ముగిసి వెంటనే మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, కడియం శ్రీహరి మీడియాకు వివరాలు వెల్లడించారు.
అనతంరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లలో మంత్రులందరూ ప్రగతి నివేదన సభా ప్రాంగణానికి వెళ్లారు.
వారు రెండు దఫాలుగా ప్రగతి సభా వేదిక వద్దకు చేరుకు్న్నారు.
కొంగర కలాన్ పరిసరాల్లో హెలికాప్టర్ లు చక్కర్లు కొట్టడంతో అందరూ సిఎం కేసిఆరే సభకు వస్తున్నారని ఈలలు, కేకలు వేశారు.
కానీ వచ్చింది సిఎం కాదు, మంత్రులు అని తెలియడంతో అభిమానులు కేసిఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు.
మరో హెలికాప్టర్ లో సిఎం కేసిఆర్ ప్రగతి భవన్ నుంచి ప్రగతి నివేదన సభకు వెళ్లనున్నారు.
మరికొద్ది సేపట్లో ఆయన హెలిక్యాప్టర్ లో వెళ్లనున్నారు.
మంత్రుల హెలిక్యాప్టర్ చక్కర్లు కొట్టిన వీడియో కింద ఉంది చూడండి.