AP: జగన్ బినామీగా పేరు ఉన్నటువంటి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఏపీ రాజధాని అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం కాస్త ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చలకు కారణం అవుతుంది.
తెలంగాణ గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడుతూ విమర్శించింది లేదు. హైదరాబాద్ విజయపతంలో దూసుకుపోతుందని ఎప్పుడూ హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడతారే తప్ప ఎప్పుడూ కూడా అక్కడ అధికారం గురించి వారి పాలన గురించి ప్రశ్నించింది లేదు కానీ తెలంగాణ మంత్రులు మాత్రం ఏపీ గురించి ఇలా విమర్శలు చేస్తూ మాట్లాడటాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు.
తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాదులో వచ్చిన వరదల కారణంగా అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కానీ వాస్తవం ఏమిటంటే విజయవాడలో వచ్చిన వరదలను చూసి ఎంతో మంది ఇన్వెస్టర్లు అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారని అందుకే హైదరాబాద్ బెంగళూరు వంటి ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని ఈయన తెలిపారు.
ఇలా తమ రాష్ట్రం గురించి వారి పాలన తమ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన మంత్రి పొంగిలేటి ఇలా అమరావతిపై విషం చిమ్మటం వెనుక జగన్ ప్రమేయం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన జగన్ బినామీగా జగన్ మిత్రుడుగా అందరికీ సుపరిచితమే దీంతో పొంగులేటి అమరావతి గురించి చేసిన ఈ వ్యాఖ్యలను టిడిపి నేతలు కార్యకర్తలు పూర్తిగా ఖండిస్తున్నారు.
ఎవరి పని తనం ఏమిటో ఏ రాష్ట్రంలో ప్రజలు ఆ రాష్ట్రంలో నిర్ణయించుకున్నారు. పొంగులేటి ప్రత్యేకమైన ఎజెండాలతో వ్యాఖ్యలు చేస్తే.. మొదటికే మోసం వస్తుందని టీడీపీ క్యాడర్ హెచ్చరికలు జారీ చేస్తోంది.