తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ఐవతి యువకులు వారు కష్టపడి చదువుకున్న దానికి ఫలితం లేకుండా పోయి నిరుద్యోగులుగా ఉన్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. కొత్త ఏడాది ప్రారంభించడానికి కొన్ని రోజుల ముందే కేసీఆర్ సర్కార్ నిరుద్యోగ యువతకి శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో ఉన్న 1365 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల డిసెంబర్ 29న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా గ్రూప్-డి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి అభ్యర్థులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు సమయం ఉంటుంది. జనవరి 24వ తేదీన దరఖాస్తు స్వీకరణ ప్రారంభమై ఫిబ్రవరి 23వ తేదీ వరకు అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను జనవరి 24 నాటికి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ఈ పరీక్ష యెుక్క ప్రిలిమ్స్ తేదీని టీఎస్పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. డిసెంబరు 1న గ్రూప్-4 కి సంబంధించిన నోటిఫికేషన్ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 2022 వ సంవత్సరం చివరి దశలో తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు తెలియజేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 26వ తేదీన గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా డిసెంబర్ 30వ తేదీన గ్రూప్ 3 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉండగా.. గ్రూప్- 4 ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు సంబంధించిన ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి నుంచి మెుదలైంది. అంతే కాకుండా కమిషన్ అధికారులు దరఖాస్తులో సాంకేతిక తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రూప్-4కు మెుదట 9168 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడగా… తాజాగా వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ప్రకటనలో 8039 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ లో 1129 పోస్టులు తగ్గాయి. ఇక గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కి సంబంధించి 1365 పోస్టులు భర్తీ చేయనున్నారు.