Revanth Reddy: ఇటీవల సినిమాల విషయంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం స్వాగతించినదేనని చెప్పాలి. దాదాపు 70 శాతం మంది ప్రేక్షకులు రేవంత్ రెడ్డి నిర్ణయానికి మద్దతు తెలియజేశారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా మహిళా అభిమాని చనిపోవడంతో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడమే కాకుండా ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని అలాగే సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచమని తెలిపారు.
ఇకపోతే తాజాగా ఇదే విషయం గురించి సినీ పెద్దలు రేవంత్ రెడ్డితో మాట్లాడిన ప్రయోజనం లేకుండా పోయింది. త్వరలోనే సంక్రాంతి పండుగ రాబోతున్న నేపథ్యంలో పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా కోసం ఎలాగైనా బెనిఫిట్ షోలో టికెట్ల రేట్లు పెంచుకోవాలని దిల్ రాజు కూడా మరోవైపు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం తెలంగాణ ప్రభుత్వాన్ని కాక పడుతున్నారని తెలుస్తుంది. కొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి పిక్స్ ను అదే విధంగా గేమ్ చేంజర్ లో చరణ్ పిక్స్ ను మ్యాచ్ చేస్తూ ‘రీల్ లో రామ్ చరణ్.. రియాలిటీలో రేవంత్ రెడ్డి’.. ఇద్దరు సేమ్ టు సేమ్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అయితే నిన్న మొన్నటి వరకు మెగా ఫాన్స్ ఎవ్వరు రేవంత్ రెడ్డి పేరు ఎత్తనే ఎత్తలేదు.
మరి కొద్ది రోజులలో ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాగైనా ఈ సినిమాకి అనుకూలంగా రేవంత్ రెడ్డిని మార్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మరికొందరు మెగా అభిమానులపై కామెంట్లు చేస్తున్నారు. ఇక స్వయంగా సినీ పెద్దలు వెళ్లి అడిగిన రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకోనని తెలిసి చెప్పిన సంగతి తెలిసిందే.