తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

Andhra pradesh state corona health bulletin

తెలంగాణలో కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా 22,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 91 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాద్ పరిధిలో 40 కొత్త కేసులు నమోదు కాగా… 15 జిల్లాల్లో కొత్త కేసులు సున్నా.. గడచిన 24 గంటల్లో 241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. మెుత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,84,465 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,375 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.