తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కీలక అంశాలను చేర్చింది. 35 అంశాలతో కూడిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్దం చేసింది. దీనిని మేడ్చల్ లో జరిగే సభలో సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ మేనిఫేస్టోను ఆవిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సమూల మార్పు కోసం ప్రణాళిక అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు.
అందె శ్రీ గీతం జయ జయహే తెలంగాణ ను రాష్ట్ర గీతంగా అమలు
సెక్రటేరియట్ కేంద్రంగా పరిపాలన, పారదర్శక పాలనకై ఆర్టీఏ చట్టం పటిష్ట అమలు
సెక్రటేరియట్ లో పీపుల్స్ గ్రీవెన్సెస్ సెల్ ఏర్పాటు
అమరుల, ఉద్యమ కారుల సంక్షేమం కోసం
ప్రతి జిల్లా లో అమరుల స్థూపం.. ఉద్యమ కారులపై కేస్ లు ఎత్తివేత …
అమరవీరులకు 10 లక్షల ఆర్ధిక సాయం
ఉచితం బస్ పాస్, డబుల్ బెడ్ రూము ఇండ్ల నిర్మాణం
* రైతులు, వ్యవసాయం కొరకు *
2 లక్షల రుణమాఫీ, కో operative లోన్స్ వడ్డీ మాఫీ, 5 వేళా కోట్ల తో స్థిరీ కరణం నిధి, 15 పంటకు మద్దతు ధర
* యువత నిరుద్యోగం*
3 వేల నిరుద్యోగ భృతి
ఏడాదిలో లక్ష ఉద్యోగాలు
20 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ
వార్షిక కాలెండర్ ఆధారంగా ఉద్యోగాల నియామకం
విద్యా రంగం
2 విడతల్లో ఫీజు రీయింబర్స్ మెంట్
ఆదాయం లో 20% నిధులని విద్యా కోసం కేటాయింపు
sc, st ఆదివాసీల కోసం
ఆదివాసీ కార్పొరేషన్ ఏఏర్పాటు
Sc, st సబ్ ప్లాన్ పటిష్ట అమలు, గిరిజన భూముల విక్రయాల పై 1970 చట్టం పటిష్ట అమలు
సమ్మక్క సారక్క జాతర గిరిజన జాతీయ పండుగగా అమలు
మైనారిటీ, సంక్షేమం
సబ్ ప్లాన్ ఏర్పాటు, వక్ఫ్ బోర్డు కి జ్యూడిషియల్ అధికారాలు
ఉర్దూని సెకండ్ లాంగ్వేజీగా గుర్తింపు
బీసీ వెనుకబడిన తరగతుల కోసం
బీసీ సబ్ ప్లాన్
కేసీఆర్ ప్రభుత్వం తొలగించిన 26 కులాలని బీసీ కులాల్లో చేరుస్తాం
ఆర్థికం గా వెనుకపడిన కులాలకు వెల్ఫే ర్ బోర్డు
స్థానిక సంస్థల్లో బీసీ లకి జనాభా ప్రకారం రిజర్వేషన్
* మహిళా సంక్షేమం*
మహిళ సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీలేని రుణం
లక్ష రూపాయిల గ్రాంట్,
6 ఉచిత సిలిండర్ లు
====================
లాయర్ల కి 300 కోట్ల సంక్షేమ నిధి
జర్నలిస్ట్ లకి 200 కోట్ల సంక్షేమ నిధి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డ్ అమలు