కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. మునుగోడులో ఓటమి తప్పదా?

ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక సామెత ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీ.ఆర్.ఎస్ పార్టీ ఈ సామెతను ఫాలో అయితే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలలో సత్తా చాటాలని ప్రయత్నిస్తూ మునుగోడులో పార్టీ ఓటమిపాలు కావడానికి పరోక్షంగా కారణమవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ హుజురాబాద్ విషయంలో చేసిన తప్పును రిపీట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కేసీఆర్ కోరి తెచ్చుకున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎంత కష్టపడినా అనుకూల ఫలితాలు రాలేదనే సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్ కోరి తెచ్చుకున్న ఎన్నిక కాకపోయినా పార్టీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలను రచించారు. అయితే కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదు.

కేసీఆర్ పార్టీ పేరును మార్చడం వల్ల ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది. టీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలోనే తప్పటడుగు వేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుగోడు పార్టీ ఇంఛార్జ్ బాధ్యతలను తీసుకోవడానికి కూడా ప్రముఖ నేతలు ఇష్టపడటం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమిపాలైతే ఓటమికి బాధ్యత వహించేదెవరో తెలియాల్సి ఉంది.

మరోవైపు కేసీఆర్ సర్కార్ రైతుబంధు మినహా అమలు చేస్తున్న ఇతర పథకాల విషయంలో సైతం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేసీఆర్ సర్కార్ డబ్బు ఖర్చు చేస్తున్నా ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతోందని కామెంట్లు జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ఈ కామెంట్ల విషయంలో కేసీఆర్ సర్కార్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.