తెలంగాలో టిఆర్ఎస్ సర్కారు పనితీరుపై ఒక మహిళలు ఆవేదనతో ఉన్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మంచిర్యాల పట్టణానికి చెందిన సువర్ణ సంకసర్ల అనే మహిళ టిఆర్ఎస్ నాలుగేళ్ల పాలనపై తన ఆవేదనను వెల్లడించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యకుండా, దళితులకు మూడెకరాల భూమి ఇయ్యకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నఫలంగా ఎందుకు సర్కారు రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు.
ఫేస్ బుక్ లోని తన వాల్ మీద సువర్ణ పెట్టిన పోస్టు వైరల్ అయింది. కింద సువర్ణ పోస్టు ఉంది మీరూ చదవండి.