కేసీఆర్ పేరు వాడుకోవటానికి ఏంటి సమస్య?

ఇది బయోపిక్ ల సీజన్. ఎటు చూసినా బయోపిక్ ల కబుర్లే వినపడుతున్నాయి. దానికి తోడు ఎలక్షన్స్ సీజన్ కావటంతో ఇంకాస్త ఊపుతో పొలిటీషన్స్ లైఫ్ లు టచ్ చేసే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే …ఎన్టీఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, వైయఎస్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రకరకాల బయోపిక్ లు రెడీ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా ‘తెలంగాణ దేవుడు’ అనే పేరుతొ రూపొందుతోంది. ఈ బయోపిక్ లో తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ పాత్రలో తాను కనిపించనున్నట్టు హీరో శ్రీకాంత్ చెప్పారు.

ఈ బయోపిక్ లాంటి సినిమాలో కేసీఆర్ బాల్యం .. విద్యాభ్యాసం .. రాజకీయనాయకుడిగా ఆయన ఎదుగుదల .. తెలంగాణ ఉద్యమం .. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఈ సినిమా కొనసాగుతుందని శ్రీకాంత్ అన్నారు.

అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే… ఈ సినిమాలో కేసీఆర్ పాత్రలో తాను కనిపిస్తున్నప్పటికీ ఆయన పేరును మాత్రం వాడుకోవడం లేదనీ .. తనపాత్ర పేరు విజయ్ దేవ్ అని చెప్పారు. తనకి ఎంతో ఇష్టమైన కేసీఆర్ పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పే విషయంలో నటుడు ఉత్తేజ్ తనకి ఎంతో సహకరిస్తున్నాడనీ చెప్పుకొచ్చారు.

అంతా బాగానే ఉంది కానీ ..కేసీఆర్ బయోపిక్ తీస్తూ…ఆయన పేరు వాడుకోవటానికి సమస్య ఏమిటనేది ఎవరికీ అర్దం కాలేదు. అంటే ఆల్రెడీ వేరే బయోపిక్ ఏమన్నా అఫీషియల్ గా రెడీ అవుతోందా …అందుకే వద్దన్నారా అనే సందేహాలు ఉన్నాయి. మరి దీనికి సమాధానం చెప్పేదెవరు.