నల్లగొండ జిల్లాలో స్మితా సభర్వాల్ పర్యటన

తెలంగాణ సిఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సభర్వాల్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని మిర్యాలగూడలో ఆమె పర్యటన సాగింది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌పై స్మితా స‌బ‌ర్వాల్ స‌మీక్ష నిర్వ‌హించారు.

మిర్యాలగూడ మండలం అవంతిపురంతో పాటు జిల్లాలో చేపడుతున్న‌ మిషన్ భగీరథ‌ పనులను ఆమె ప‌రిశీలించారు. పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో పనుల్లో ఎదురవుతున్న సమస్యల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ పనులను కూడా ఆమె పరిశీలించారు. ప‌నులు గ‌డువులోగా పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.