నల్గొండ జిల్లాలో దారుణం..సరదాగా ఈత కొట్టడానికి దిగి గల్లంతయిన విద్యార్థులు!

వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల చెరువులు, డ్యాములు నిండి నిండుకుండల్లా పారుతున్నాయి. ఈ క్రమంలో చిన్న పిల్లల, పెద్దలు అని తేడా లేకుండా వాటిని చూడటానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. సరదాగా పిక్నిక్కి వచ్చిన ఫార్మసీ విద్యార్థులు ఈత కొట్టడానికి నీటిలో దిగి గల్లంతయ్యారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…హైదరాబాద్‌ చిలుకూరు బాలాజీ ఫార్మసీకి కాలేజీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు శనివారం ఉదయం పిక్నిక్‌ కోసం నాగార్జున సాగర్‌కు వచ్చారు.శనివారం మధ్యాహ్నం వరకు స్నేహితులంతా ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపి.. అక్కడినుండి బయలుదేరి అక్కపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆకాశ్‌, కృష్ణ, గణేశ్‌ అనే ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. కొంతసేపటి తర్వాత నీటిలో దిగిన ముగ్గురు స్నేహితులు కనిపించకపోవడంతో అక్కడ ఉన్న విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కఠిన స్థలానికి చేరుకొని విద్యార్థుల కోసం రచయితగాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.ఈక్రమంలో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా.. మరొక విద్యార్థి మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సరదాగా ఈత కొట్టడానికి నీటిలో దిగిన స్నేహితులు ఇలా కల ఎదుటే కనిపించకుండా పోవడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.