మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చిన ఉపఎన్నిక మునుగోడు ప్రజల పాలిట మాత్రం వరమైంది. ఈ ఉపఎన్నిక వల్ల మునుగోడు అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. కేసీఆర్ సర్కార్ ఇస్తున్న హామీలు విని మునుగోడు ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీలకు ఏ మాత్రం తగ్గకుండా బీజేపీ కూడా హామీలు ఇస్తోంది.
ఈ ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఓటర్లకు వేల రూపాయల లాభం చేకూరుతోంది. గతంలో ఏ ఉపఎన్నికకు జరగని స్థాయిలో ఈ ఉపఎన్నిక కోసం ఖర్చు జరగగా ఈ ఖర్చు వల్ల ఈసీ ఈ ఉపఎన్నిక జరగక ముందే రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ ఉపఎన్నికకు అన్ని పార్టీలు కలిసి ఏకంగా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉండవచ్చని ఒక అంచనా.
ఒక నియోజకవర్గంలో గెలుపు కోసం ఈ స్థాయిలో భవిష్యత్తులో కూడా ఖర్చు చేయడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉపఎన్నికలో గెలుపు కోసం బీజేపీ, తెరాస పార్టీలు తమకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. విమర్శలను లెక్క చేయకుండా ఏ స్థాయిలో కష్టపడితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందో ఈ పార్టీలు అదే స్థాయిలో కష్టపడుతుండటం గమనార్హం.
మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధిస్తే కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీ.ఆర్.ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని ఈ ఉపఎన్నిక ద్వారా అభిప్రాయం కలిగించాలని బీజేపీ భావిస్తోంది. సర్వేల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండగా వాస్తవ ఫలితాలు అదే విధంగా ఉంటాయో లేదో చూడాలి. టీడీపీ సైతం బీజేపీకి సహకారం అందిస్తోందని అందువల్ల బీజేపీ గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.