ఏ రాష్ట్ర సీఎం ఏ పని చేసినా ఆ పని ద్వారా ప్రయోజనం చేకూరాలనే ఆలోచన ఉంటుంది. ప్రజల మెప్పు పొందడం కోసం ప్రభుత్వాలు ఎన్ని స్కీమ్స్ అమలు చేయడానికి అయినా సిద్ధపడతాయి. కొన్ని నెలల క్రితం కేసీఆర్ రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరేలా చేసిన సంగతి తెలిసిందే. 700 మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
అయితే బీ.ఆర్.ఎస్ పార్టీ ప్లానింగ్ లో భాగంగానే కేసీఆర్ ఈ ఆర్థిక సాయం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ మాత్రం అస్సలు వెనక్కు తగ్గడం లేదు. ఢిల్లీలో కేసీఆర్ ఇప్పటికే పార్టీ కార్యాలయంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యాలయానికి రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. తన నిర్ణయాల ద్వారా కేసీఆర్ రైతులకు దగ్గరవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే కేసీఆర్ పార్టీకి ఇతర పార్టీల సపోర్ట్ కూడా దక్కితే బాగుంటుందని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇతర పార్టీల నేతలను కేసీఆర్ ఏ విధంగా మెప్పిస్తారో చూడాల్సి ఉంది. ఏపీలో ఏ పార్టీ నుంచి కేసీఆర్ కు మద్దతు లభిస్తుందో చూడాల్సి ఉంది. కేసీఆర్ ఎలాంటి మేనిఫెస్టోను ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటికే ఆప్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. రైతులకు కేసీఆర్ ఆకట్టుకుంటే ఆయన రాజకీయాల్లో సక్సెస్ కావడం కష్టం కాదు. కేసీఆర్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. కేసీఆర్ రాజకీయాల్లో కూడా సంచలనాలు సృష్టించాలని బీ.ఆర్.ఎస్ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు.