నాన్న చెప్పడం వల్లే తెలంగాణ ప్రజల బాధ్యత తీసుకున్నా.. షర్మిల కామెంట్స్ విన్నారా?

వైఎస్సార్టీపీ అధినేత షర్మిల తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించే దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. అయితే తాను తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి నాన్నే కారణమంటూ షర్మిల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాన్న చెప్పడం వల్లే తెలంగాణ ప్రజల బాధ్యత తీసుకున్నానని షర్మిల చెప్పుకొచ్చారు.

 

అమెరికాలో మాట్లాడుతూ షర్మిల ఈ కామెంట్లు చేశారు. నాన్న నా గుండెపై తెలంగాణ ప్రజల కోసం పోరాడాలని విల్లు రాశారని షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారని నాన్న నాకు చెప్పినట్టు అనిపించిందని షర్మిల కామెంట్లు చేశారు. వైఎస్సార్టీపీతో రాజన్న పాలన తీసుకొనిరావాలని అనుకుంటున్నామని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రజలు నేను ప్రేమించిన ప్రజలు అని షర్మిల చెప్పుకొచ్చారు.

 

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఏపీ ముఖ్యమా? తెలంగాణ ముఖ్యమా? అని అడిగితే ఆయన బ్రతికి ఉన్నా సమాధానం చెప్పేవారు కాదని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని షర్మిల చెప్పుకొచ్చారు. వైఎస్సార్ అమలు చేసిన స్కీమ్స్ ప్రస్తుతం తెలంగాణలో అమలు కావడం లేదని షర్మిల చెప్పుకొచ్చారు.

 

త్వరలో తెలంగాణలో షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుందని సమాచారం. షర్మిల పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేం కానీ కొన్ని స్థానాలను గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. షర్మిల పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.