సంచలన నిర్ణయం తీసుకున్న మిర్యాలగూడ అమృత

తన భర్త హత్య తర్వాత తన పై సోషల్ మీడియాలో కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న వారి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె  మిర్యాలగూడ సీఐ  నాగరాజుకి ఫిర్యాదు చేసింది.

తనను కించపరిచే విధంగా ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తున్నాయని, అసత్య ప్రచారాలను ఆపాలని తాను ప్రాధేయపడినా ఎలాంటి మార్పు లేదని ఈ సంధర్బంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అమృతకు తెలిపారు.

మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇది నచ్చని అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ని కిరాయి హంతకులతో చంపించాడు. అమృత వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీనిని సహించని మారుతీరావు దారుణానికి ఒడిగట్టాడు. నిందితులందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అమృత ప్రస్తుతం 6 నెలల గర్భిణి. తన తండ్రి ఇంటికి వెళ్లేది లేదని తాను ప్రణయ్ హంతకులకు శిక్ష పడే వరకు పోరాడుతానని తెలిపింది. నేతలు, నాయకులు అనేక సంఘాల వారు అమృతను ఓదార్చి పలు హామీలిచ్చారు.

ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ లకు వ్యతిరేకంగా పలు కామెంట్లు వచ్చాయి. 9 వ తరగతిలేం ప్రేమ అని కొందరు, మారుతీరావు చేసింది కరెక్టే అని కొందరు కామెంట్లు చేశారు. ప్రభుత్వం అమృతకు ప్రభుత్వ ఉద్యోగం, 14 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, 3 ఎకరాల భూమి ఇస్తామని హామీనిచ్చింది. అలాగే మరికొందరు ప్రణయ్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ఇంకొందరైతే ఏకంగా అమృత ప్రణయ్ తమ్ముడిని పెళ్లి చేసుకుంటుందని రాతలు రాశారు. వీటన్నింటి పై కామెంట్లు వచ్చాయని అమృత పోలీసులకు తెలిపింది.

ప్రేమికుడు చనిపోతే ఇన్ని చేయాలంటే మరీ దేశం కోసం ప్రాణాలిచ్చిన సైనికులకు ఇంకెంత ఇవ్వాలి, సమాజం కోసం పోరాడిన యోధులున్నారు వారికేం చేయాలని ప్రశ్నల పరంపర , కామెంట్లు మొదలయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో తాను మానసికంగా చాలా బాధపడ్డానని అమృత తెలిపింది. చాలా మందికి మీరు నాకు సహాయం చేయకున్నా పర్లేదు కానీ నన్ను మానసికంగా చంపకండి అని వేడుకున్నా కూడా కామెంట్లు ఆపలేదని ఆవేదన చెందింది. అసలు తాను చేసిన అంత పెద్ద తప్పేంటి అని అమృత వారిని  నిలదీసింది.

తన తండ్రితో అమృత

తన బతుకు చీకటి మయంగా ఉందని, తన కడుపులో ఉన్న బిడ్డ కోసం కన్నీటిని, బాధను దింగమింగుకొని ధైర్యం కూడగట్టుకుంటుంటే వీరి వ్యాఖ్యలు తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయంది. ప్రణయ్ హత్యతో సమాజమంతా తనకు అండగా నిలవడాన్ని చూసి తనకు ఇంత పెద్ద కుటుంబం ఉందనుకున్నానని కానీ ఇంతలోనే కొందరు అసభ్య కామెంట్లు చేయడంతో తాను షాక్ కు గురయ్యానంది. అమృత ఫిర్యాదుతో సోషల్ మీడియాలో మరే విధంగా ప్రతిస్పందనలు వస్తాయోనని అంతా చర్చించుకుంటున్నారు.

 

టిఆర్ ఎస్ సభలున్న రోజు పనికి పోనక్కర్లేదట రూ.500, బీరు, బిర్యానీ ఫ్రీ అట https://bit.ly/2IAP6fY