సెన్సేషనల్ న్యూస్ : డిఎస్ ఫ్యామిలీలో చిచ్చు

టిఆర్ఎస్ ఎంపి ధర్మపురి శ్రీనివాస్ ఫ్యామిలీలో చిచ్చు రాజుకున్నది. ఒకవైపు డిఎస్ పెద్ద కొడుకు లైంగిక వేధింపుల కేసులో నిర్భయ చట్టం కింద కేసుల్లో ఇరికి తప్పించుకుని తిరుగుతుండగా తాజాగా డిఎస్ చిన్న కుమారుడు రంగంలోకి దిగారు. సంజయ్ కారణంగా తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందేమోనన్న ఉద్దశమో లేక ఇంకేదైనా కారణమో కానీ సంజయ్ మీద కేసుల విషయంలో తాజాగా అర్వింద్ సీరియస్ గా స్పందించారు. శుక్రవారం పలు మీడియా చానెళ్లతో అర్వింద్ మాట్లాడారు. సంజయ్ మీద లైంగిక వేధింపుల కేసు నిరూపణ అయితే కఠినాతి కఠినంగా శిక్షించాలని అర్వింద్ డిమాండ్ చేశారు.

అంతేకాదు చాలా అంశాలను అర్వింద్ వెల్లడించారు. అసలు సంజయ్ కి తనకు తోడబుట్టిన సంబంధం తప్ప మిగతా ఏరకమైన సంబందం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు రాజకీయపరంగా తాను తన తండ్రి డిఎస్ నే విభేధించి బయటకొచ్చి బిజెపిలో చేరానని గుర్తు చేశారు. ఇప్పుడు తన తండ్రి డిఎస్ తో పాటు సంజయ్ ది కూడా వేరే పార్టీ తనది వేరే పార్టీ అని అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో తాను టిఆర్ఎస్ సర్కారుపై మడమ తిప్పని పోరాటం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నిజామాబాద్ లో ఎవరిని అడిగినా చెబతారని అన్నారు. అదే సమయంలో తన తండ్రితోపాటు సంజయ్ కూడా టిఆర్ఎస్ లోనే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పరంగా వారితో తనకు ఏమాత్రం సబంధం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అర్వింద్ విమర్శించారు. కేవలం కేసిఆర్ సీటు గజ్వేల్, హరీష్ సీటు సిద్ధిపేటలో రైతులు బాగుంటే సరిపోతుందా అని అర్వింద్ ప్రశ్నించారు. మిగిలిన తెలంగాణ రాష్ట్రమంతా రైతుల కష్టాలు పట్టించుకోరా అని నిలదీశారు. పనిలో పనిగా నిజామాబాద్ ఎంపి కవిత పైనా అర్వింద్ ఫైర్ అయ్యారు. బోధన్ ప్రజలంటే కవితకు ప్రేమే లేదని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుపై కవితకు చిత్తశుద్ధే లేదన్నారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.