తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సజ్జనార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈయన ప్రయాణిస్తున్న కారుకు ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అసలు ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…
తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ శనివారం రాత్రి మహారాష్ట్రకు తన కారులో ప్రయాణం చేస్తుండగా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా దూసుకొచ్చింది. దీంతో ఆటో వేగంగా వచ్చి కారుకు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు అలాగే సజ్జనార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైనటువంటి సజ్జనార్ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వారు రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, లక్ష్మిగాగుర్తించారు వీరిని వెంటనే పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పెద్దపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులను కరీంనగర్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఇక ఎండి సజ్జనార్ కుడి చేతివేళ్ళకు గాయాలు తగిలినట్టు తెలుస్తుంది ఆటో డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది.