భారీగా పెరిగిన బస్‌పాస్‌ చార్జీలు!

ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో బస్‌పాస్‌ చార్జీలను ఆర్టీసీ పెంచింది. ఇక కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది. జనరల్‌ బస్‌ టికెట్‌ (జీబీటీ) పాసుల కేటగిరీలో ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగింది.