కేసీఆర్ కు కోతలు, కేటీఆర్ కు కొలెస్ట్రాల్ ఎక్కువ : రేవంత్ (వీడియో)

ఆపద్దర్మ సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు కోతలెక్కువ.. కేటిఆర్ కు కొలెస్ట్రాల్ ఎక్కువ… కేసీఆర్ నీ బలుపును వంచుతాం.. నిన్ను నీ పార్టీని పండబెట్టి తొక్కుతాం అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ ల సభ పెడితే కొడంగల్ ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పిక్కటిల్లుర్రు. వీరికి చెమటలు పట్టినయి. కాంగ్రెస్ సభ తర్వాత కేటిఆర్ ని తీసుకొచ్చి నిరంజన్ సభ పెట్టిండు. చివరకు పట్టుమని 1000 మంది కార్యకర్తలు కూడా రాలేదని రేవంత్ విమర్శించారు.  రేవంత్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.  

 

REVANTH REDDY SPEECH

వనపర్తిలో జరిగిన సభలో రేవంత్ ప్రసంగించారు. లక్ష ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన హామీ కావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టి కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు. 12 సంవత్సరాలకు వచ్చే కృష్ణ పుష్కరాలలో కమీషన్ తీసుకోకపోతే, చివరక మొలతాళ్లు అమ్ముకునే వారి దగ్గర కమీషన్ తీసుకోకపోతే… రా అంజన్న గుడి దగ్గర తడి బట్టతో స్నానం చేద్దాం రాగలవా అని వనపర్తి టిఆర్ ఎస్ అభ్యర్థి నిరంజన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.