జగన్ ను అడుగుపెట్టనివ్వకుండా చేసిన కెసిఆర్… షర్మిలకు ఎందుకు ఎంట్రీ పాస్ ఇస్తున్నారు ?

revanth reddy sensational comments on y.s sharmila

ఉద్యమాలు, త్యాగాలు చేసి తెలంగాణాను సాధించింది మరలా ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు పాలించటానికి కాదంటూ… షర్మిల పెడుతున్న పార్టీ మీద రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీఎంగా వైఎస్ మీద తెలంగాణ‌లో అభిమానం, ప్రేమ ఉంద‌ని… ఆయ‌న బిడ్డ‌గా తెలంగాణ‌కు వ‌స్తే చీర,సారె పెట్టి పంపుతాం కానీ ప‌ద‌వులు అప్ప‌జెప్ప‌మ‌న్నారు. తెలంగాణ ప‌క్షాన నిల‌బ‌డి, రాజ‌న్న రాజ్యం తెచ్చేందుకు ష‌ర్మిల రావాల‌నుకుంటే… ద‌క్షిణ తెలంగాణ ఏడారిగా మార్చ‌బోతున్న పొత్తిరెడ్డిపాడు సామ‌ర్థ్యం పెంపుపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

revanth reddy sensational comments on y.s sharmila
revanth reddy sensational comments on y.s sharmila

రాజీవ్ రైతు భ‌రోసా పాద‌యాత్ర‌లో భాగంగా మూడో రోజు ఎంపీ రేవంత్ రెడ్డి పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా ఆయ‌న ష‌ర్మిల పార్టీ ఏర్పాటుపై స్పందించారు. రెండుసార్లు కేసీఆర్ సీఎం అయ్యాక‌… మూడోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు వ‌దిలిన బాణం ష‌ర్మిల అని మండిప‌డ్డారు. తెలంగాణ వ‌ద్దు… స‌మైక్య రాష్ట్రం ముద్దు అని గ‌తంలో మీ కుటుంబం అన్న‌దని, మొద‌ట మీరు క్ష‌మాప‌ణ చెప్పి పార్టీ ప్ర‌క‌ట‌న చేయాల‌న్నారు. జ‌గ‌న్ పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని, ఏపీ సీఎంగా ఉన్న ‌జ‌గ‌న్… ఏపీ త‌రుపున పంచాయితీ పెడుతుంటే మీ అన్న‌ను కాద‌ని తెలంగాణ పక్షాన మీరు నిల‌బ‌డి కొట్లాడ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. మీరు జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను ఖండించి, నిల‌బ‌డగ‌లిగితేనే ఇక్క‌డ రాజ‌కీయాలు చేయండ‌న్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ పౌరుడు పాలించాలా… మ‌న నీటిని ఏపీకి త‌ర‌లించుక‌పోతున్న జ‌గ‌న్ చెల్లి ఏలాలో వైఎస్ అభిమానులు ఆలోచించాల‌న్నారు. ఒకప్పుడు రాజకీయం చేయటానికి రాష్ట్రానికి వచ్చిన జగన్ను రాళ్లతో కొట్టించి తరిమేసిన కెసిఆర్ ఇప్పుడు షర్మిల ఏకంగా పార్టీనే పెడుతుంటే మౌనంగా ఉండటం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అండ‌గా ఉన్న ద‌ళితులు, గిరిజనులు, క్రిస్టియ‌న్లు, ముస్లీంలు, రెడ్ల‌ను దూరం చేసి, మూడోసారి అధికారం కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. మరలా దోపిడీకి గురి అవ్వటానికి తెలంగాణా రాష్ట్రం, తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని … ఇలాంటి రాజకీయాలు చాలా చూశారని, త్వరలో అందరికి గట్టిగా బుద్ది చెప్తారని రేవంత్ రెడ్డి అన్నారు.