కాబోయే సిఎం… రేవంత్ అన్న… గోడలెక్కి చూసిన ఫ్యాన్స్

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఒకవైపు ఐటి అధికారులు గంటల కొద్ది సోదాలు చేస్తుంటే బయట ఆయన  ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. రేవంత్ ఇంట్లోకి వెళ్లిన 20 గంటల వరకు కూడా ఫ్యాన్స్ ఇంటి ముందే ఉండి రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.

అయితే శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో రేవంత్ రెడ్డిని చూపించాలంటూ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. రేవంత్ అభిమానులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు చివరకు వారి డిమాండ్ కు తలొగ్గారు. 

ఒక దశలో రేవంత్ అభిమానులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో పోలీసులకు, రేవంత్ అనుచరులకు మధ్య తోపుటాల జరిగింది. అయితే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని గ్రహించిన పోలీసులు రేవంత్ రెడ్డిని బయటకు తీసుకొచ్చేందుకు ఒప్పుకున్నారు. 

ఆ సమయంలో రేవంత్ బయటకు వస్తుండగా రేవంత్ అభిమానులు కాబోయే సిఎం రేవంతన్న.. అంటూ స్లోగన్స్ చేశారు. కాబోయే సిఎం రేవంతన్న అంటూనే కేసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాల హోరెత్తించారు.

అయితే రేవంత్ తన అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రెండు నిమిషాలు ఉన్న తర్వాత తిరిగి పోలీసులు రేవంత్ ను ఇంట్లోకి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆయనను చూసేందుకు ప్రహారీ గోడలు ఎక్కారు. అయినప్పటికీ రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

రేవంత్ అభిమానుల నినాదాల వీడియో కింద ఉంది చూడొచ్చు.

revanth fans halchal