కేటిఆర్ కు రేవంత్ బర్త్ డే గ్రీటింగ్స్.. అందులోనూ ట్విస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు తెలంగాణ అంతటా ఘనంగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సరికొత్తగా కేటిఆర్ బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే తన బర్త్ డే కోసం పూల బొకేలు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టొద్దన్ని కేటిఆర్ స్ట్రిక్ట్ గా ఆదేశాలిచ్చారు. కొందరు పెట్టిన పోస్టర్లను స్వయంగా జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గరుండి తొలగింపజేశారు. అయినప్పటికీ కేటిఆర్ మీద ఉన్న అభిమానంతో పేపర్ యాడ్స్, ఫ్లెక్సీలు, బ్యానర్లు రాయించేశారు ఆయన అభిమానులు.

ఇక మరో విషయమేమంటే మంత్రి కేటిఆర్ కు ప్రతిపక్ష నేత, ఇటీవల టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. బర్త్ డే గ్రీటింగ్స్ లోనూ రేవంత్ ట్విస్ట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అదేమంటే.. హ్యాప్పీ బర్త్ డే చెబుతూనే.. ట్విట్టర్ లో కాదోయ్.. ఫీల్డులో ఫైట్ చేద్దాం.. దమ్ముంటే రా అంటూ కొటేషన్ పెట్టారు. కొన్ని ఫొటోలను కూడా రేవంత్ ఆ పోస్టుకు జత చేశారు. రేవంత్ పెట్టిన పోస్టు యదాతదంగా కింద ఇస్తున్నాం చూడొచ్చు.

రేవంత్ ఈ పోెస్టును సరదాగానే పోస్టు చేసినట్లు చెబుతున్నారు. ఫుట్ బాల్ ఆడుతూ దిగిన ఫొటోలను కూడా రేవంత్ ఈ సందర్భంగా పోస్టు చేశారు.

 

https://platform.twitter.com/widgets.js