అడవి పందులకు పెట్టినట్లే టిఆర్ఎసోళ్లకు పెట్టాలి : రేవంత్ (వీడియో)

కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి తొలి బహిరంగసభలో పాల్గొన్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఎంపికైన తర్వాత వారం గడవకముందే ఆయన ఇండ్లపై ఐటి దాడులు జరిగాయి. ఒక దశలో రేవంత్ ను అరెస్టు చేస్తారని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంలో రేవంత్ కూడా కుట్ర జరుగుతుందన్నట్లు తన నియోజకవర్గంలోని కోస్గి సభలో మాట్లాడారు. అన్నీ మంచిగా ఉంటే మల్లా వస్తా. లేదంటే జైలు నుంచే నామినేషన్ పత్రాలు పంపుతా అని కార్యకర్తలకు హెచ్చరిక చేశారు.

కానీ రెండు రోజులపాటు సోదాలు చేసిన ఐటి అధికారులు ఒక కాయితం రేవంత్ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అరెస్టు లేదని తేలడంతో రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో తొలిసారి కామారెడ్డిలో పర్యటించారు. షబ్బీర్ అలీని బంపర్ మెజార్టీతో గెలిపించాలని జనాలకు పిలుపునిచ్చారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెరుకు తోటలు ఖరాబ్ చేస్తున్న అడవి పందులకు ఎట్ల కరెంటు పెడతామో అలాగే టిఆర్ఎస్ నేతలకు ఓటు ద్వారా కరెంటు షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. 

షబ్బీర్ అలీ గెలిస్తే రాష్ట్రంలో ఒకటి లేదంటే రెండో స్థానంలో ఉంటాడని స్పష్టం చేశారు. కానీ గంప గోవర్దన్ గెలిస్తే వందో, వంద ఒకటో స్థానంలో ఉంటాడని ఎద్దేవా చేశారు. గంపా గోవర్దన్ ఏనాడైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడిండా అని నిలదీశారు. రేవంత్ ఇంకా ఏమన్నారో కింద వీడియో ఉంది చూడండి. 

 

revanth kamareddy