రేవంత్ దెబ్బకు కేటిఆర్ బామ్మార్ది కంపెనీ విలవిల

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కేసిఆర్ కుటుంబంపై మరోమారు తీవ్రమై ఆరోపణలు గుప్పించారు. కేటిఆర్ బామ్మార్ధిని మళ్లీ టార్గెట్ చేసి విమర్శలు చేశారు. కేటిఆర్ బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్ పాకాల డేటింగ్ బ్రోకర్ అవతారమెత్తి హైదరాబాద్ పరిసరాలను కలుషితం చేస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబమే ఇల్లీగల్ దందాలు చేస్తుండడం మంచి సంకేతాలు కాదని హెచ్చరించారు. 

సెన్సేషన్ రైజ్ పేరుతో గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రాత్రి ఈవెంట్స్ నౌ సంస్థ మ్యూజిక్ క్లబ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా లాంటిదంటూ శనివారం ఉదయమే రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ప్రజోపయోగాల కోసం వినియోగించాల్సిన గచ్చిబౌలి స్టేడియాన్ని ఇలా విచ్చలవిడి కార్యక్రమం కోసం నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టడం దారుణమని విమర్శించారు. అంతేకాదు ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో చిన్నపిల్లలను కూడా అనుమతిస్తున్నారని ఆరోపించారు. 

 

పైగా కేటిఆర్ బామ్మార్ది అయిన రాజ్ పాకాల రావ్ ఈ ఈవెంట్ వెనుక ఉన్నారని రేవంత్ ఆరోపించారు. ఇందులో డ్రగ్స్ సరఫరా జరిగే చాన్స్ ఉందన్నారు. అమ్మాయిల సప్లై కార్యక్రమాన్ని కూడా రాజ్ పాకాల చేపడుతూ డేటింగ్ బ్రోకర్ అవతారమెత్తాడని విమర్శించారు. ఇది ఎంతమాత్రం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాదన్నారు. సంపన్న శ్రేణి పిల్లలను ప్రమాదంలోకి నెట్టడమే తప్ప ఇందులో ఏరకమైన ప్రయోజనం లేదన్నారు. అసలు పబ్లిక్ స్థలాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు.

ఈ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నేతలు ఆందోళన చేస్తారని హెచ్చరించారు. అయితే రేవంత్ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు గచ్చిబౌలి స్టేడియం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ డేటింగ్ క్లబ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే ఈ ఈవెంట్ లో గంజాయి పంపిణీ జోరుగా సాగినట్లు ఆదివారం వెల్లడైంది. దీనిపై పోలీసులు కొందరిని అరెస్టు కూడా చేశారు. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నేతలు వచ్చి ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రేవంత్ తర్వాత వారిని పోలీసు స్టేసన్ కు పోయి పరామర్శించారు.

రేవంత్ పై వంద కోట్లకు పరువు నష్టం దావా

ఇక రేవంత్ విమర్శలపై నొచ్చుకున్నట్లు ప్రకటన చేశారు ఈవెంట్స్ నౌ కంపెనీ పెద్దలు. తమను డ్రగ్ వ్యాపారి అని ఇల్లీగల్ దందాలు చేసే కంపెనీ అంటూ రేవంత్ విమర్శలు చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాము టికెట్ల అమ్మకాలు మాత్రమే జరుపుతామని అక్కడ ఏ దందాలు జరుగుతాయో తమకు తెలియదు అని వారు సెలవిచ్చారు. ఇక రేవంత్ తమ సంస్థ పరువు తీసే ప్రయత్నం చేశారని, తమ మీద బురద చల్లారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ సంస్థ. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

గతంలోనూ ఇలాంటి అవాకులు చెవాకులు పేలిన రేవంత్ రెడ్డికి కంపెనీ తరుపున లీగల్ నోటీసులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దానికి సమాధానం కూడా ఇవ్వలేక రేవంత్ రెడ్డి పారిపోయారని ఆరోపించారు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము రేవంత్ కు లేకనే కేటిఆర్ బామ్మార్ది సంస్థపై విమర్శలు చేస్తున్నాడని వారు తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి విమర్శలకు దిగుతున్నాడని వంద కోట్ల పరువునష్టం దావా వేసి రేవంత్ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. 

కేటిఆర్ బామ్మార్ది రాజ్ పాకాల మచ్చలేని మనిషి 

ఈవెంట్స్ నౌ వ్యవస్థాపకులు రాజ్ పాకాల అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని సాఫ్ట్ వేర్ కంపెనీలను నిర్వహిస్తున్నారని సంస్థ తెలిపింది. గత పద్దెనిమిది ఏళ్లుగా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారని, ఎటువంటి చిన్న మచ్చ లేకుండా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజ్ పాకాల గురించి కంపెనీ ప్రతినిధులు వివరించారు. కేవలం మంత్రి కేటిఆర్ బామ్మార్ది అయినందువల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. రేవంత్ తీవ్రమైన విమర్శలు చేసి కంపెనీ ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు కాబట్టి పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. 

అయితే ఈవెంట్స్ నౌ కంపెనీ వార్నింగ్ లను లైట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. గతంలోనే ఆయన కేటిఆర్ బామ్మార్ది రాజ్ పాకాల, సుమ పాకాల ఇద్దరూ డ్రగ్ బిజినెస్ లో ఆరితేరిపోయారని, డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. చిన్న పిల్లల జీవితాలతో రాజ్ పాకాల చెలగాటమాడుతున్నాడని ఆరోపించారు. తెలంగాణలో అధికార పార్టీని అడ్డం పెట్టుకుని రాజ్ పాకాల బ్రోకర్ పనులు చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

 

అయితే అప్పట్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటున్నట్లు రాజ్ పాకాల హడావిడి చేశారు. రేవంత్ రెడ్డికి చట్టపరంగా శిక్ష తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే రేవంత్ ఆ లీగల్ నోటీసులను లైట్ తీసుకున్నారు. అంతేకాకుండా ఏం చేసుకుంటావో చేస్కో అంటూ తిరిగి వార్నింగ్ ఇచ్చారు. కానీ అప్పట్లో రేవంత్ కు లీగల్ నోటీసులు ఇచ్చిన రాజ్ పాకాల తర్వాత సైలెంట్ అయిపోయారు తప్ప తదుపరి ఎలాంటి చట్టపరమైన చర్యలకు దిగలేదు.

ఇక ఈసారి రాజ్ పాకాల శిబిరం డోస్ పెంచింది. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు వంద కోట్ల కు రేవంత్ మీద పరువు నష్టం దావా  వేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పైగా అప్పట్లో లీగల్ నోటీసులు ఇస్తే రేవంత్ సమాధానం చెప్పకుండా పారిపోయినట్లు ప్రకటించింది రాజ్ పాకాల కంపెనీ. కానీ అప్పుడు పారిపోయింది రేవంత్ రెడ్డి కాదని, లీగల్ నోటీసులు ఇచ్చి కేసు వేయడం చేతగాక రాజ్ పాకాల కంపెనీయే పారిపోయిందని రేవంత్ రెడ్డి అనుచరుడు ఒకరు తెలిపారు. 

రాజ్ పాకాల వి ఉడుత ఊపులే : రేవంత్ శిబిరం

అప్పుడు పారిపోయినట్లే మళ్లీ వంద కోట్ల పరువు నష్టం దావా విషయంలో కూడా పారిపోవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ రాజ్ పాకాలకు దమ్ము, ధైర్యం ఉంటే, ఆయన మచ్చలేని మనిషే అయితే రేవంత్ మీద వంద కాదు వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసి కోర్టుల్లో ఫైట్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

మరి ఏది ఏమైనా ఈ ఈవెంట్ విషయంలో రేవంత్ దెబ్బకు కేటిఆర్ బామ్మార్ది రాజ్ పాకాల శిబిరం విలవిలలాడినట్లు కనబడుతున్నది. గతంలో లీగల్ నోటీసులు ఇచ్చి షో చేసినట్లే ఈసారి 100 కోట్ల పరువు నష్టం దావా పేరుతో హడావిడి తప్ప ఏం చేయలేరని రేవంత్ శిబిరం ధీమాతో ఉంది. మరి పాకాల కంపెనీ రేవంత్ మీద పరువు నష్టం కేసులు వేస్తారా, గతంలో మాదిరిగా సైలెంట్ అయితారా అన్నది చూడాలి.

 

గచ్చిబౌలి స్టేడియంలో సెన్సేషన్ ఈవెంట్ మరిన్ని వీడియోలు  

 

gachibowli3

 

gachibowli event 1