ఏపీ బీజేపీలో టీడీపీ అనుకూల నేతలు ఉంటారు. వారంతా బీజేపీలో ఉంటూనే చంద్రబాబు క్షేమం కోరుతుంటారు. ఇదే టీం ఒకటి కమ్యునిస్టు పార్టీల్లో కూడా ఉంది. ఇదే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ లో కూడా టీడీపీ అను”కుల” టీం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ టీం కు ఒక కొత్త కష్టం వచ్చి పడింది. అది వారికి ఏమాత్రం జీర్ణం కావడం లేదని తెలుస్తుంది.
అవును… తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీడీపీ అను”కుల” టీం కు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. దీనికి కారణం.. షర్మిళ కాంగ్రెస్ లోకి వస్తున్నారనే వార్తలే! దీంతో వారంతా బహిరంగంగానే తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఫలితంగా… నెటిజన్ల సెటైర్లకు రెండు చెంపలూ ఎరుపెక్కించేసుకుంటున్నారు. వీరిలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేణుకా చౌదరి ఒకరు!
ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి… షర్మిళపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి షర్మిల పోటీ చేస్తానని ప్రకటించడంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు రేణుకా చౌదరి స్పందిస్తూ… షర్మిల అంటే ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని ఆమె… షర్మిలది ఆంధ్రా… వాళ్ల అన్న అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు.
అవును… షర్మిళ ఎవరో తనకు తెలియదని రేణుకా చౌదరి చెప్పడంపై నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇందులో భాగంగా.. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది.. వీరందరి గెలుపులో కీల భూమిక పోషించింది వైఎస్సార్ అని.. ఆయన కూతురు షర్మిళ అని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుచెప్పుకోకుండా మనుగడ సాధించలేదని గుర్తు చేస్తున్నారు.
ఇదే సమయంలో షర్మిళది ఆంధ్రా అని చెబుతున్న రేణుకా చౌదరి… ఏ హక్కుతో ఏపీలో పోటీచేస్తానని గతంలో చెప్పారని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ శాసన రాజధాని అమరావతి పోరాటానికి ఏ హక్కుతో తన మద్దతు తెలుపుతున్నారని అడుగుతున్నారు. ఖమ్మంలో రేణుకా పలుకుబడి శూన్యానికి దగ్గరగా వచ్చే సమయం ఆసన్నమైందని… ఇప్పటికే భట్టి విక్రమార్క, పొంగులేటి వర్గానికి ఆమెకు పడటం లేదని అంటున్నారు.
వీరికి తోడు షర్మిళ కూడా తోడయితే… రేణుకా చౌదరికి ఈ సారి టిక్కెట్టు దక్కకపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. దీంతో… రేణుకా చౌదరి చెంపలు ఎరుపెక్కేలా వాయించేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.