తెలంగాణ రాష్ట్రం రావాలంటే… ఆంధ్రప్రాంతానికి చెందిన వారిని తిట్టాలనే సూత్రాన్ని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రతిపాదించారు! దాన్ని అందరూ సక్రమంగా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు అమలు చేశారు. సరే అప్పుడంటే అవసరం.. అవకాశం.. ఎమోషనల్ పాలిటిక్స్ లో భాగంగా తప్పలేదు అనుకుంటే… ఇప్పటికీ ఆ మాటలు తెలంగాణ రాజకీయ నాయకుల నుండి వస్తున్నాయి. అంటే ఇప్పటికీ వారి రాజకీయాలకు ఆంధ్రా ప్రాంతం వారిని తిట్టడం ఒక మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. అయితే అది ఇంతకాలం కేసీఆర్ కి పేటెంట్ లా ఉండేది.. ఇప్పుడు రేవంత్ కూడా ఆ దారిలోకి వచ్చేశారు. గత్యంతరం లేకో ఏమో కానీ… ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇప్పటికీ మానడం !
రాష్ట్రాలు విడిపోయాయి.. ప్రజలు కలిసి ఉంటున్నారు.. యాసలు వేరైనా ఒకే బాష మాట్లాడూ అన్నదమ్ముల్లా మెలుగుతున్నారు. అయితే ఇప్పటికీ ఆంధ్ర అన్నా.. ఆంధ్రా ప్రజలన్నా.. ఆంధ్రకి సంబందించిన అధికారులన్నా.. తెలంగాణ రాజకీయ నాయకులకు ఒక విమర్శనాస్త్రంగానే ఉంది. సాధారణంగా.. మాట్లాడటానికి పాయింట్ లేనప్పుడు, తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు, అంటే… గత్యంతరం లేనప్పుడు మాత్రమే ఈ పదాలను వాడటం గమనార్హం. అవును… తాజాగా టిపీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి కూడా గత్యంతరం లేక ఆంధ్రా నామస్మరణ చేశారు!
తాజాగా సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్… సిట్ ద్వారా టీఎస్పీఎస్సీ లీకేజ్ పూర్తిగా బయటపడదని.. “సిట్ అంటే స్టాండ్ మాత్రమేనని” అభిప్రాయపడ్డారు. ఇదేక్రమంలో గతంలో బీఆరెస్స్ గవర్నమెంట్ లో వేసిన సిట్ ల చరిత్రను గుర్తుచేశారు రేవంత్. గతంలో సిట్ వేసిన కేసులన్నీ ఎక్కడపోయాయని ప్రశ్నించిన ఆయన… డ్రగ్స్, నయీమ్ ల్యాండ్, గోల్డ్ స్టోన్ ప్రసాద్, హౌసింగ్ బోర్డు, ఎమ్మెల్యే కొనుగోలు అంశం వంటివన్నీ పక్కదారి పట్టాయని తెలిపారు.
ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాల డిటేల్స్ అన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని హైకోర్టును కోరామని చెప్పిన రేవంత్… వీటితోపాటు ఇప్పటి వరకు సిట్ విచారించిన విషయాలను కూడా తెలపాలని కోరినట్లు చెప్పారు. పేపర్ లీకేజ్ అంశం ప్రవీణ్, రాజశేఖర్ లకే పరిమితం కాదని.. చైర్మన్, సెక్రటరీలు, శంకర్, లక్ష్మీలను కూడా బాధ్యులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.
అక్కడితో ఆగితే సబ్జెక్టుకు మసాలా అంటదనుకున్నారో ఏమోకానీ… ఆంధ్ర వ్యక్తి చేతిలోనే సిట్ బాధ్యతలు ఉన్నప్పుడు.. తెలంగాణ నిరుద్యోగులకు ఎలా మేలు జరుగుందని ప్రశ్నించారు. దీంతో రేవంత్ ఒక ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వంలో సిట్ అధికారులంతా తెలంగాణా వారనుకుంటే… ఏ దర్యాప్తులో మొత్తం వాస్తవాలు బయటపడ్డాయో.. ఏ దర్యాప్తులో బాధితులకు న్యాయం జరిగిందో.. ఏ దర్యాప్తులో నిదితులకు శిక్ష పడిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే… పనికిమాలిన రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే.. ప్రతీ అధికారీ తన క్యారెక్టర్ ని బేస్ చేసుకుని దర్యాప్తు జరుపుతారు. అంతే తప్ప… ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి వచ్చిన అధికారులు కరెక్ట్ గా పనిచేస్తారు.. ఆంధ్రా నుంచి వచ్చిన ఆఫీసర్స్ వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడటం వల్ల.. విమర్శలు చేసేవారి స్థాయి తగ్గుతుంది తప్ప.. కొత్తగా వణగూరే ప్రయోజనం ఉండదని గ్రహించాలని సూచిస్తున్నారు విశ్లేషకులు.