మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఘోర పరాజయానికి కారణాలు ఇవేనా?

మునుగోడు ఉపఎన్నికలో తెరాస విజయం సాధించింది. రెండు రౌండ్లు మినహా మిగతా రౌండ్స్ లో బీజేపీ హవా కొనసాగించలేదు. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ గెలవాల్సిన చోట తెరాస పాగా వేయడం గమనార్హం. 2024 ఎన్నికల్లో కూడా తెరాసకు తెలంగాణలో తిరుగులేదని ఈ ఉపఎన్నిక ద్వారా సంకేతాలు ఇవ్వాలని కేసీఆర్ భావించారని సమాచారం అందుతోంది.

ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా సాధించకపోవడం గమనార్హం. అయితే బీజేపీ చేసిన కొన్ని తప్పులే బీజేపీ పరాజయానికి కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెరాసకు ధీటుగా ప్రచారం చేయడంలో ప్రజలకు హామీలను ఇవ్వడంలో బీజేపీ ఫెయిలైంది. మునుగోడు ఉపఎన్నిక జరగడానికి బీజేపీనే కారణం కాగా పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ విఫలమైంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఆర్థికంగా బలంగా ఉన్నా పార్టీని గెలిపించుకోవడంలో ఫెయిలయ్యారు.

అయితే తెరాసకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీజేపీ రాబోయే రోజుల్లో మునుగోడులో మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. చౌటుప్పల్ లో ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడం బీజేపీకి మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీజేపీ నేతలను సైతం నిరాశకు గురి చేసిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మునుగోడు ఉపఎన్నిక ఫలితం తేలిపోవడంతో రాబోయే రోజుల్లో మరో నియోజకవర్గంలో ఉపఎన్నిక దిశగా అడుగులు వేయకపోవచ్చని సమాచారం అందుతోంది. మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికలో తెరాస గెలవడానికి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడమే కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.