బంగారు తెలంగాణ ఎపుడొస్తుంది, కెకె ఏమన్నారో వినండి

కొొంగర కలాన్ సభలో రాజ్యసభ సభ్యుడు కేశరవరావు (కెకె) బంగారు తెలంగాణ ఎపుడు సాధ్యమో చెప్పారు.  ఇది ఆలస్యమయ్యేందుకు కారణం కూడా చెప్పారు.  ఈ సభలో ఆయన ప్రసంగించారు.  ప్రసంగించింది కేవలం రెండు నిమిషాలేనయినా ముఖ్యమంత్రిని ఆకట్టుకునే ప్రసంగం చేశారు.  తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే మరొక పదేళ్లు పడుతుందని అన్నారు. ‘‘ ఇంకొక పది సంవత్సరాలు కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉంటే, బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది,’ అని ఆయన చెప్పారు.

పదేళ్లు ఎందుకు కావాలంటే, కెసిఆర్ ప్రభుత్వ ం వచ్చి నాలుగున్నరేళ్లవు తున్నా, నిజానికి ఆయన పరిపాలించింది కేవలం రెండున్నరే సంవత్సరాలే నని కెకె అన్నారు.

‘నిజానికి టీఆర్‌ఎస్‌ పార్టీ పాలన సాగింది రెండున్నర సంవత్సరాలు మాత్రమే  మొదటి రెండు సంవత్సరాలు రాష్ట్ర విభజస సమస్యల నుంచి బయటపడేందుకు  గడిచిపోయాయి,’ అని అంటూ బంగారు తెలంగాణ  ఏర్పడాలంటే మరొక రెండు దఫాలు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన అన్నారు.

గత  నాలుగున్నరేళ్లలో ఏం చేశామోప్రజలకు చెప్పాలనుకున్నామని  అందుకే ప్రజలను ఇక్కడికి పెద్ద ఎత్తులో రప్పించి భారీ బహిరంగ సభ నిర్వహించి నాలుగున్నరేళ్ల ప్రగతి గురించి చెబుతున్నామని ఆయన అన్నారు.

‘తెలంగాణలో 80 శాతం బడుగుబలహీన వర్గాలే ఉన్నయి. ప్రతీ బిసి కులాన్ని గుర్తించి వారి అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు సీఎం కెసిఆర్‌ పూనుకోవడం చాలా గొప్ప విషయం, ఇది  తెలంగాణలో ప్రజలే పాలకులయ్యేందుకు బాటవేస్తుంది,’ అని కెకె కొనియాడారు.