అట్టహాసంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ ప్రాంగణంలో భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం సమయంలో కొంగర కలాన్ లో వర్షం పడింది. భారీ ఈదురు గాలులు వీచడంతో కటౌట్లు అన్ని కూలిపోయాయి. సీఎం కేసీఆర్ బొమ్మలతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు కూలిపోవడంతో అక్కడ ఉన్న కళాకారులు, వాలంటీర్లు భయంతో బెంబెలెత్తి సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. సభ ప్రాంగణమంతా వర్షం నీటితో నిండిపోయింది. ఇప్పటికే బస్సులలో, ట్రాక్టర్లలో దాదాపు 50 వేల మంది సభాస్థలికి చేరుకున్నారు. కొంగరకలాన్ లో పరిస్థితి కింద వీడియోలో ఉంది చూడండి.