సంచలనం సృష్టించిన వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో… ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనే చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ వృతి హాట్ టాపిక్ గా మారింది! దీంతో… పోస్ట్ మార్టం రిపోర్ట్ పై ఆసక్తి నెలకొంది! అయితే… ఆదివారం వరకు ఆమె పోస్టుమార్టం రిపోర్టు పోలీసుల చేతికి వచ్చిందన్న ప్రచారం సాగిన క్రమంలో… సోమవారం వరంగల్ సీపీ రంగనాథ్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇంకా పోస్టు మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే ఉందని.. పూర్తి వివరాలు రాలేదని వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే అన్నీ వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆ సంగతులు అలా ఉంటే… మరో వైపు “టాక్సాలజీ రిపోర్టు” పోలీసుల చేతికి అందిందంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో “ఆమె శరీరంలో విష పదార్థాలు ఏమీ లేవని” తేలిందన్నట్లుగా ఉందట! ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు ఆమె ఇంజక్షన్ తీసుకొని చనిపోయినట్లు భావిస్తున్నట్లు నిర్దారణకు వచ్చారు. కానీ ప్రీతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టు మార్గం రిపోర్టుపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే!
అయితే ఈ రిపోర్ట్ పై ప్రీతి సోదరుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. టాక్సాలజీ రిపోర్టు అలా వస్తుందన్న విషయం తమకు ముందె తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. శరీరంలో ఎలాంటి విషపదార్థపు ఆనవాళ్లూ లేకపోతే.. మరి ప్రీతి ఎలా చనిపోయిందని ప్రీతి సోదరుడు ఫృధ్వీ ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజుల తర్వాత శాంపిల్స్ తీసుకుంటే.. ఏమీ లేనటుగానే వస్తుందని.. తాము చెప్పింది అధికారులు వినడం లేదని ప్రీతి సోదరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో.. ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది!
మరి ఈ వ్యవహారంపై పోలీసులు – అధికారులు – ఇటు ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందించబోతున్నారనేది వేచి చూడాలి!