ప్రణయ్ ను హత్య చేయించిన అమృత తండ్రి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. కూతురికంటే పరువే ముఖ్యం అందుకే ప్రణయ్ ని హత్య చేయించా అని మారుతీరావు పోలీసుల విచారణలో వెల్లడించడం ప్రతి ఒక్కరిని ఖంగు తినేలా చేసింది.
ప్రణయ్ హత్యకు మహమ్మద్ బారి అనే రౌడీ షీటర్ తో మారుతీరావు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. గతంలో అదే మహమ్మద్ బారి, మారుతీరావుని కిడ్నాప్ చేశాడు. అప్పటి నుండి వారిద్దరి మధ్య పరిచయం కుదిరింది. సహజంగా సాధారణ మనుషులు కిడ్నాప్ చేసిన వ్యక్తులకు దూరంగా ఉంటారు. వాళ్ళని ఎప్పుడైనా జీవితంలో ఇంకొకసారి చూడాల్సి వస్తే బెంబేలెత్తిపోతారు కానీ మారుతీరావు ఇందుకు భిన్నంగా ఉన్నాడు. కిడ్నాప్ చేసిన వ్యక్తితోనే సంబంధాలు కొనసాగిస్తున్నాడు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారి కావడంతో అతను చేసే సెటిల్మెంట్స్ కి పనికొస్తాడు అనే నేపథ్యంలో అతడితో కాంటాక్ట్ లోనే ఉన్నాడు. అంటే మారుతీరావుది ఎంత క్రిమనల్ బ్రెయినో అవగతమవుతోంది.
ఒకవైపు తన కూతురు కూడా మా నాన్న రియల్ ఎస్టేట్స్ బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి సెటిల్మెంట్స్ చేస్తుంటాడని కొంత ఐడియా ఉంది కానీ నా భర్తని చంపేంత క్రూరుడని తెలుసుకోలేకపోయాను అని చెప్పింది. ఆమె మాటలని బట్టి స్పష్టంగా అర్ధమవుతోంది మారుతిరావుకి పెద్ద క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉందని. ఇక ప్రణయ్ తల్లిదండ్రలు, బంధువులు, ఊరిలోవారు కూడా చెబుతున్నారు మారుతీరావు చాలా దుర్మార్గుడని. ఎంతోమంది దగ్గరి నుండి అక్రమంగా భూకబ్జాలు చేసి సొమ్ము కూడబెట్టాడని వారంతా అంటున్నారు.
కిరోసిన్ డీలర్ గా బ్రతుకుదెరువు కోసం మిర్యాలగూడ వచ్చిన మారుతీరావు ఈనాడు ప్రణయ్ ని చంపడానికి కోటి రూపాయలు సుపారీ ఇవ్వబోయాడంటే అతను ఎన్ని నేరాలు, ఘోరాలు చేసి సంపాదించాడో అర్ధమవుతుంది అంటున్నారు. ప్రణయ్ హత్య అతని నేర చరిత్రలో ఒక మచ్చు తునక, అతను ఇలాంటివి చాలా నేరాలు చేసాడని వారు వ్యక్తం చేస్తున్నారు.
వారి వివాహాన్ని సహించలేకపోతే వారిద్దరిని జీవితాంతం చేరదీయకపోతే సరిపోయేది కదా… నిండు ప్రాణాన్ని తీసేయడం పాశవికంగా ఉంది. చిలకా గోరింకల్లా బ్రతుకుతున్న వారి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడం ఎందుకు అంటూ ప్రతి ఒక్కరూ మారుతీరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.