విలువ‌లు నేర్పించ‌లేదా రామ్ గోపాల్ వ‌ర్మా?

                          వివాదాల వ‌ర్మ‌కు దిమ్మ‌తిరిగే ట్రీటిచ్చిన అమృత‌

ఫాదర్స్ డే సందర్భంగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ `మర్డర్` పేరుతో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ణ‌య్ హ‌త్య‌కేసు.. ప్ర‌ణ‌య్‌- అమృత కులాంత‌ర‌ ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సినిమాని తెర‌కెక్కిస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన వ‌ర్మ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు.

అమృత తండ్రి మారుతి రావు గూండాల్ని పంపి కుమార్తె భర్త ప్రణయ్ ని హత్య చేయించిన‌ సంగ‌తి తెలిసిందే. అటుపై అమృత తండ్రికి ఎదురు తిరిగి పోలీస్ కేసు పెట్టారు. అనంత‌రం మారుతిరావును పోలీసులు అరెస్టు చేసి కేసును విచారించారు. బెయిల్ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన మారుతీరావు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ మొత్తం క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించేందుకు వ‌ర్మ ప్లాన్ చేశారు.
 
https://www.instagram.com/p/CBs_R5tFRLt/
 

అయితే ఆర్జీవీ ప్ర‌య‌త్నం మంట‌లు పుట్టిస్తోంది. తాజా ప్రకటన వివాదాలకు దారితీసింది. ఈ ప్రకటనపై అమృత తీవ్ర అభ్య‌త‌రం వ్య‌క్తం చేయ‌డ‌మే గాక రామ్ గోపాల్ వ‌ర్మ స్వార్థ‌పూరిత నీచ‌బుద్ధిని ప్ర‌శ్నించారు. మ‌ర్చిపోవాల‌నుకున్నా మ‌రువ‌లేని ఆ ఘ‌ట‌న‌పై సినిమా తీస్తూ మాన‌సికంగా క‌ల్లోలం సృష్టిస్తున్నాడ‌ని అమృత ఆరోపించారు. త‌న మ‌నో వ్య‌థ‌ను వివ‌రిస్తూ సోష‌ల్ మీడియాలో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. ఇందులో RGVపై బాంబ్ పేల్చారు.

అస‌లే గందరగోళంగా ఉన్న జీవితానికి మరోసారి బాధితురాలిగా మారాలా? అంటూ అమృత తీవ్రంగానే ఈ లేఖ‌లో ప్ర‌శ్నించారు. “నేను ఈ రోజు మధ్యాహ్నం నిద్రపోతున్నాను. నా అత్తమ్మ – మామయ్య (ప్రణయ్ తల్లిదండ్రులు) నా పై సినిమా అంటూ ఉన్న వార్త‌ను తెలుసుకుని ఒత్తిడికి గురయ్యారు. నా దివంగత భర్త ప్రణయ్ .. దివంగత తండ్రి మారుతి రావు ల‌పై సినిమా అంటూ వివాదాస్పద చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ పోస్ట్ చేశారు. వర్మ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ఈ సంగ‌తి వెల్ల‌డించారు.

జీవితంలో ఈ కొత్త సమస్యను ఎలా ఎదుర్కోబోతున్నామో అన్న ఆందోళ‌న‌ను నా అత్త మామ‌లు వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌య‌త్నాన్ని ఆపాల‌ని కోరారు. నేను పోస్ట్ చూసినప్పుడు ఆత్మహత్యలు క‌ల్లోలం రేపాయి. నా ప్రపంచం మొత్తం మళ్లీ తలక్రిందులైంది. నా గుండె నొప్పిని త‌ట్టుకోలేకపోయింది. నా భర్త ప్రాణయ్ హత్య జరిగిన రోజు నుండి రోజులు నెలలు ఆవేద‌న చెందాను. నా పాత్ర, నా జీవితం మరియు నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే నా నిర్ణయాన్ని వ్య‌తిరేకించిన స‌మాజం.. ఆత్మగౌరవంతో జీవించాల‌న్న నా ఆలోచ‌న‌ను చంపేసే ప్ర‌య‌త్నం చేసింది“ అని ఆవేద‌న చెందారు. అలాగే నాకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు తప్ప నా కథ ఎవరికీ తెలియదు అని కూడా అమృత తెలిపారు.

నా తండ్రి తన కులం, సంపద గురించి అహంకారపూరిత తప్పుడు జీవితాన్ని గడిపారు. కాంట్రాక్ట్ కిల్లర్స్ తో నా భర్తను చంపించ‌డానికి ఇదే కారణం. నేను గర్భవతిగా ఉన్నప్పుడు పగటి వెలుగులో అతన్ని నా కళ్ళ ముందు నిర్దాక్షిణ్యంగా చంపారు. నేను ఇప్ప‌టికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. కోర్టులు .. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా. నా గర్భం .. పోస్ట్ డెలివరీ త‌ర్వాతా మీడియాను ఎదుర్కొంటున్నాను.

తప్పుడు ప్రచారాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను ప్రతిరోజూ, ప్రతి రాత్రి గుండె బ‌రువును మోస్తున్నాను. ఆవేద‌న‌ను మోస్తున్నాను. నాకు పుట్టిన పిల్లవాడు గోడ‌పై వేలాడుతున్న త‌న తండ్రి ఛాయాచిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు నేను కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటాను. అతను తన వైపు ఎందుకు చూస్తున్నాడో నాకు తెలుసు. నిజ జీవితంలో నా బంగారు పిల్లవాడు తన తండ్రిని ఎప్పుడూ చూడలేదు. నా బిడ్డ‌ ఈ వ్యక్తి ఎప్పుడూ నా దగ్గరకు ఎందుకు రాలేదు అనే ఆలోచనతో ఉండవచ్చు? . మనం జీవిస్తున్న సామాజిక నిర్మాణమే అతని తండ్రిని చంపిన విషయాన్ని ఆ చిన్నారి అర్థం చేసుకోవడం నాకు పెద్ద సవాల్“

రామ్ గోపాల్ వర్మతో పోరాటం మ‌రో కొత్త సవాల్ అనే భావిస్తున్నాను. మా ఛాయాచిత్రాలను బహిరంగ వేదికపై ఉపయోగించినందుకు. అతను నా పిల్లవాడి ఫోటోను ఉపయోగిస్తే నేను ఆశ్చర్యపోను.

నా జీవితం గురించి కుల భావాలు పక్షపాతంతో జీవిస్తున్న సామాన్య ప్రజలు కేవలం నాగరికత, చదువురానివారని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. జీవితంలోని వివిధ సమస్యలపై సమాజం ఆలోచన ప్రక్రియపై ఉపన్యాసాలు ఇచ్చే చలన చిత్ర నిర్మాత ట్విట్టర్‌లో మా ఛాయాచిత్రాలను ఉపయోగించటానికి అనుమతి అడగడం లేదా  మా కథను చెప్పమని అడ‌గాల‌ని ఆలోచించరు.

ప్ర‌ణ‌య్ హత్య జరిగినప్పటి నుండి ఆన్‌లైన్ లో కామెంట్ల వ‌ల్ల చాలా బాధపడ్డాను .ప్రజలు నన్ను మ‌ళ్లీ వివాహం చేసుకోమని అడుగుతారు. ప్రజలు నా లైంగిక జీవితం గురించి ప్ర‌శ్నిస్తారు. కొంద‌రు నాకు ఎఫైర్ ఉందా? అని అడుగుతున్నారు. మ‌రికొంద‌రు నన్ను చనిపోవాలని అన్నారు.

ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో వీటితో ఏదైనా సంబంధం కలిగి ఉంటే న‌న్ను వేధించేవాళ్లు పెరుగుతారు. సమాజంలో నా లాంటి యువ వితంతువు బాధ ఆయనకు తెలుస‌నే అనుకుంటున్నాను.  

నా తండ్రి లేని పిల్లవాడిని చూసుకోవటానికి చాలా బాధ్యతతో నేను సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాను. పేరెంటింగ్ అనేది ఒక వ్యక్తిని, అతని ఆలోచన ప్రక్రియను నిర్ణయాలను రూపొందిస్తుంది. నేను నా ఇంటి నుండి బయటకు వచ్చి.. ప్రేమించిన వ్యక్తితో జీవించడానికి కారణం గ‌తించిన కాలంలో నేను నివసించిన వాతావరణాన్ని చూపిస్తుంది. ఇవ‌న్నీ నా నిర్ణ‌యాల‌కు కార‌ణం.

ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నా జీవిత కథ ఆధారంగా ఒక సినిమా పోస్టర్‌ను విడుదల చేయబోతున్నానని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చూసిన ప్రతి నిమిషం నేను వణికిపోతున్నాను. నా పిల్లల జీవితాన్ని కాపాడటానికి నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ ప్ర‌య‌త్నం నన్ను మరోసారి సంఘంలో బ‌య‌ట‌ప‌డిపోయేలా చేసింది.

తన భర్త హత్య జరిగిన రోజు నుండి ప్రతి రోజూ ఒత్తిడితో కూడిన మానసిక జీవితాన్ని అనుభవిస్తున్న ఒంటరి తల్లి పట్ల మీరు ఎటువంటి ఆందోళన లేకుండా చాలా ప్రచారం పొందారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మీరు విడుదల చేసిన పోస్టర్ నేను చూశాను. అది నా జీవితానికి సంబంధించినది కాదు. ఇది మా పేర్లను ఉపయోగించడం ద్వారా మీరు విక్రయించదలిచిన నకిలీ కథ. మేం ఒక అందమైన జీవితాన్ని గడపాలని అనుకుంటే నా కలలకు జ‌రిగిన అన్యాయంకి సంబంధించిన క‌థ ఇది. మీలాంటి జాతీయ స్థాయి వ్యక్తి మీ రెండు నిమిషాల పాపులారిటీ కీర్తి కోసం దీనిని ఉపయోగిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు.

నేను నా కథను నా పిల్లవాడికి వెల్లడించిన రోజు, మీరు రిలీజ్ చేసిన‌ ఛాయాచిత్రం అందులో ఒక భాగం అవుతుంది. ఒక స్త్రీని గౌరవించటానికి మీకు విలువలను నేర్పించగల తల్లి లేనందుకు మిస్టర్ రామ్ గోపాల్ వర్మపై నేను జాలిపడుతున్నాను.

మీపై కేసు పెట్టి నేను మీకు ఎలాంటి ప్రచారం ఇవ్వను. నకిలీ చలన చిత్ర నిర్మాత పేరిట మీరు ఈ స్వార్థపూరిత మానిప్యులేటివ్ సమాజంలో ఒక భాగం మాత్రమే. పెయిన్ చూడ‌డంలో నేను మీ కంటే ఎక్కువ జీవితాన్ని చూశాను. శాంతితో విశ్రాంతి తీసుకోండి“ అంటూ అమృత సుదీర్ఘంగా ఆ లేఖ‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

https://www.instagram.com/p/CBsrmtWFYx5/