కెసిఆర్ సారూ, చెబితే వినాలని ఉంది…

కసి ఉంటేనే కవిత్వం వస్తుంది.  ఎంతకసి ఉంటే అంత మంచి  కవిత్వం వస్తుంది. కసి ఉంటే అక్కసే కవిత్వంలాగా పెల్లుబికి వస్తుంది… అని ఈ కింద రాసిన మూడు ముక్కలు చెబుతాయి. ఇందులో కసి వుంది. ఎనలేని ఆవేదన ఉంది. తిరుగులేని నిజాయితీ ఉంది. అందుకే దీనిని షేర్ చేస్తున్నాం. నచ్చినవాళ్లు, మెచ్చినవాళ్లు, మంచిమాట నలుగురితో పంచుకోవాలనుకునేవాళ్లు బెక్కం  ప్రశాంత్ కసిని నలు మూలలకు షేర్ చేయండి.

 

మూసేసిన 5000 బడుల గురించి,

ఇయ్యని ఫీ రీఇంబర్స్మెంట్ గురించి

కెసిఆర్ సారూ, చెబితే వినాలని ఉంది

69% నుంచి 40% కి పడిపోయిన సర్కారు దవాఖన్ల ప్రసవాల గురించి,

దేశం 75% అక్ష్యరాస్యత ఉంటే

తెలంగాణ 65% కిందికి ఎట్ల పడుతుందనేదాని గురించి

కెసిఆర్  సారూ, చెబితే వినాలని ఉంది

ప్రభుత్వ విద్య మీద కర్చుపెట్టడం లో 18 వ స్థానం ఎట్లా వచ్చిందో,

ఇంటికి లక్ష రుపాయలు కరుసు పెట్టి పెట్టని నల్లా గురించి,

మనిషికి 50,000 అప్పు గురించి,

అవినీతిలో 2వ స్థానం గురించి,

దళిత ముఖ్యమంత్రి గురించి

కెసిఆర్ సారూ, చెబితే వినాలని ఉంది

మెడ మీద తలకాయ గురించి,

సన్న బియ్యం తింటున్న పంది కొక్కుల గురించి,

తినని అమాయక పిల్లల గురించి 

ఒక్కసారి, 

కెసిఆర్ సారూ, చెబితే వినాలని ఉంది

125 కోట్ల సిల్కు చీరల గురించి,

4000 రైతుల ఆత్మహత్యల గురించి,

కొనుక్కొచ్చిన కరెంటు గురించి,

కెసిఆర్ సారూ,చెబితే వినాలని ఉంది

పెట్టని 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం గురించి,

కట్టని అమరుల స్మారక చిహనం గురించి

కట్టిన పైరవి భవన్ గురించి పెట్టని కంపనీల గురించి 

పక్క రాష్ట్రాలకు పోయిన కంపెనీల గురించి

కెసిఆర్ సారూ చెబితే వినాలని ఉంది

అంతేకాదు సారూ,

గుర్తించిన అమరుల గురించి వినాలని ఉంది

 పంటి తోటి తీసిన ముల్లుల గురించి, మియాపూర్ భూమి గురించి వినాలని ఉంది

నయీం అక్రమ ఆస్తుల గురించి కూడా వినాలి ఉంది

మొత్తానికి అయ్య , బిడ్డ, కొడుకు, అల్లుడు, సడ్డకుని కొడులు చేస్తున్న పాలన గురించేకాదు,

చెయ్యని పాలన గురించి

ఓయులో కొచ్చి చెప్తే వినాలని ఉంది.

 

-బెక్కం ప్రశాంత్
పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు
తెలంగాణ జన సమితి