తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి పేరు పోచారం కాదు. ఇప్పటి వరకు అందరు కూడా పోచారం ఆయన ఇంటి పేరు అనుకున్నారు. కానీ పోచారం ఆయన ఊరి పేరు. అసలు ఆయన పూర్తి పేరు పరిగె శ్రీనివాస రెడ్డి. కానీ రాజకీయాలలో సుదీర్ఘ కాలం కొనసాగడంతో అంతా ఆయనను ఊరి పేరు మీదుగా పోచారం శ్రీనివాసరెడ్డి అని పిలవడం మొదలు పెట్టారు. దీంతో అతని ఊరి పేరే ఇంటి పేరుగా మారిపోయింది.
ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన పోచారంకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పారు. దీంతో అంతా అవునా అని అనుకున్నారు.