టిఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఆపండి

సెప్టెంబరు 2వ తేదీన అవుటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో కొంగర కలాన్ వద్ద జరపనున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి నివేదన సభను ఆపాలంటూ ఒక న్యాయవాది హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 న నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ప్రముఖ న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్  ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉంటుందని సూచించారు.

ఔటర్ పరిసరాల్లో పర్యావరణానికి హాని చేకూర్చే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. లక్షల మందిని తరలించడం ద్వారా పర్యావరణం మరింత కలుషితం అవుతుందన్నారు.

ఇలా సభలు పెట్టి ప్రజలను, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగజేయకుండా చూడాలని పిటీషన్ లో కోరారు. శ్రీధర్ వేసిన పిటిషన్ పై శుక్రవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.