జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని పవన్ వ్యూహమే గెలిపించిందా.?

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. అన్న సామెత అందరికీ తెలిసే వుంటుంది.! భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నేత లక్ష్మణ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షం జనసేనపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలిప్పుడు భారతీయ జనతా పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. బీజేపీలో బండి సంజయ్ వర్గం, బండి సంజయ్ వ్యతిరేక వర్గం.. ఇలా రెండు వర్గాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని బీజేపీ అధినాయకత్వం తప్పించిందో, అప్పుడే తెలంగాణలో బీజేపీ పతనం ప్రారంభమైంది. అప్పటివరకు బీజేపీ, తెలంగాణలో చాలా ఊపు మీదుంది.

ఆ బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి చెందిన లక్ష్మణ్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అనూహ్యమైన ఫలితాల్ని కాస్తా, జనసేన కోటాలో పడేశారు. ‘జనసేనాని వ్యూహం వల్లనే జీహెఛ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది..’ అంటూ వ్యాఖ్యానించారు లక్ష్మణ్.

దీంతో, ‘ఇకపై బీజేపీలో వుండటం దండగ..’ అన్న నిర్ణయానికి వచ్చేస్తున్న చాలామంది బీజేపీ నేతలు, ఒకరొకరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. వాస్తవానికి, బండి సంజయ్‌ని తప్పించినప్పటినుంచే.. బీజేపీ ఖాళీ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ జోరు మరింత పెరిగిందంతే.

నిజమా.? అబద్ధమా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఇప్పుడు, తెలంగాణలో బీజేపీ ఖాళీ అయిపోయేలా చేస్తున్నట్లే కనిపిస్తోంది.