తెలంగాణలో జనసేన.. కేసీఆర్ టార్గెట్ చేస్తే మామూలుగా ఉండదు పవన్?

ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్ చేయడంతో ఇప్పటికే పవన్ నటించిన రెండు సినిమాలకు ఎదురుదెబ్బలు తగిలాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అని పవన్ ప్రచారం చేసుకున్నా కొన్ని ఏరియాలలో ఆ సినిమాలు బ్రేక్ ఈవెన్ కాలేదు. హరిహర వీరమల్లు మూవీ ఎప్పుడు విడుదలైనా ఆ సినిమాను కూడా టార్గెట్ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కినా ఈ మూవీకి మాత్రం టికెట్ రేట్ల పెంపు ఉండదని సమాచారం.

అయితే ఇప్పటివరకు జగన్ తోనే పవన్ కు గొడవ కాగా తెలంగాణలో కూడా జనసేనను యాక్టివ్ చేస్తానని చేస్తున్న కామెంట్లు కేసీఆర్ కు చిరాకు తెప్పిస్తున్నాయి. ఏపీలో బీ.ఆర్.ఎస్ పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జనసేన పోటీ చేయాలని పవన్ ప్లాన్ కాగా రాబోయే రోజుల్లో కేసీఆర్ సైతం పవన్ ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ పవన్ ను టార్గెట్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు.

పవన్ కళ్యాణ్ ఆస్తులు హైదరాబాద్ లోనే ఉన్నాయి. కేసీఆర్ ఒకవేళ పవన్ ఆస్తులను టార్గెట్ చేసినా ఆయనకు ఇబ్బందులు తప్పవు. పవన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లలో ఎక్కువ మొత్తం కలెక్షన్లు నైజాం నుంచి వస్తాయి. అందువల్ల నైజాం ఏరియాను దూరం చేసుకుంటే పవన్ కు కెరీర్ పరంగా ఇబ్బందులు తప్పవు. రెండు పడవల ప్రయాణం చేయడం వల్లే పవన్ కు ఇలాంటి దెబ్బలు తగులుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో ఎదురుదెబ్బలు కొత్త కాదు. చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలకు శత్రువు కాగా ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్ల పవన్ సైతం అన్ని రాజకీయ పార్టీలకు శత్రువుగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.